బ్యూటిప్స్

12 Dec, 2016 15:20 IST|Sakshi
బ్యూటిప్స్

ఆయిలీ స్కిన్ తాజాగా కనిపించాలంటే... బాగా పండిన రెండు టొమాటోలలో రెండు చుక్కల నిమ్మరసం వేసి, మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడగాలి.క్లెన్సింగ్ మిల్క్ చర్మంలోని పోర్స్ వరకు వెళ్లి మలినాలను తొలగించి, శుభ్రం చేస్తుంది. అయితే దీనిని రోజూ వాడితే చర్మంలోని సహజసిద్ధమైన నూనెలు తగ్గి, పొడిగా తయారవుతుంది. పొడిగా మారిన చర్మం త్వరగా ముడతలు పడుతుంది. అందుకని ఎప్పుడు పడితే అప్పుడు క్లెన్సింగ్ మిల్క్‌ను వాడకూడదు. చర్మతత్త్వాన్ని బట్టి పదిహేను, నెలరోజులకు ఒకసారి ఉపయోగించడం మేలు.

చర్మం పొడిబారి చిరాకు పెడుతుంటే... అరకప్పు సోయాపిండిని తీసుకుని, అందులో కాసిన్ని కొబ్బరిపాలు, ఓ చెంచాడు బాదం నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంట తరువాత చల్లటి నీటితో కడిగేసుకుంటే పొడిదనం తగ్గి, ముఖం నిగనిగలాడుతుంది.

నిమ్మకాయ రసంతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. నిమ్మకాయలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఒక స్పూను నిమ్మకాయ రసంతో ఒక స్పూను ముల్తానా మిట్టి పౌడర్‌ని కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుని  ఓ 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మంలోని మట్టితొలగి, చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. అలాగే నిమ్మకాయ రసంలో పెరుగు, తేనె కలిపి పెట్టుకుంటే కూడా చక్కని ఫలితం ఉంటుంది.

మరిన్ని వార్తలు