బ్యూటీ క్రీమ్‌

2 Nov, 2017 23:31 IST|Sakshi

బ్యూటిప్స్‌

గులాబీలు పన్నీటి రూపంలోనే కాదు క్రీమ్‌గానూ సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తాయి. ఈ క్రీమ్‌ను ఇంట్లోనే చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం!నాలుగు టేబుల్‌స్పూన్ల ఆలివ్‌ ఆయిల్, బాగా వాసన ఉన్న గులాబీ రెక్కలు రెండు గుప్పెళ్లు, శుభ్రపరిచిన తేనెమైనం ఒక టేబుల్‌స్పూన్, వర్షం నీరు కాని శుభ్రమైన నీరు కానితీసుకోవాలి.ఆలివ్‌ ఆయిల్‌ను మరిగే స్థాయి వరకు వేడి చేసి అందులో గులాబీ రెక్కలను వేయాలి. దీనిని గాలి దూరని సీసాలో భద్రపరిచి సుమారు వారం రోజులు ఉంచాలి. అప్పటికి గులాబీలసుగంధం నూనెలో కలుస్తుంది.

వడపోసి రెక్కలను వేరు చేయాలి. తేనె మైనాన్ని(హనీ వ్యాక్స్‌) ఒక పాత్రలోకి తీసుకుని కరిగే వరకు వేడి చేసి ఈ నూనెలో కలిపి చల్లారనివ్వాలి. చివరగాఅవసరాన్ని బట్టి ఒకటి – రెండు టీ స్పూన్ల నీటిని కలిపి భద్రపరుచుకోవాలి. ఆలివ్‌ ఆయిల్‌కు బదులుగా స్వచ్ఛమైన కొబ్బరి నూనె లేదా మరేదైనా నూనెను కూడా వాడుకోవచ్చు. దీనిని ఒకసారి తయారు చేసుకుని నాలుగు నెలలపాటు వాడుకోవచ్చు.

మరిన్ని వార్తలు