నన్నడగొద్దు ప్లీజ్‌ | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Published Thu, Nov 2 2017 11:34 PM

love doctor solve the problem - Sakshi

హాయ్‌ అన్నయ్యా! నేను బీటెక్‌ చదువుతున్నా. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఇప్పటి వరకు మేము మంచి ఫ్రెండ్స్‌. నేను లవ్‌ చేస్తున్నా కానీ, తను లవ్‌ చేస్తున్నాడో లేదోతెలియదు. కానీ ప్రపోజ్‌ చేస్తే మంచి ఫ్రెండ్‌ దూరమవుతాడు. ఏదైనా సలహా చెప్పండి అన్నయ్యా.. ప్లీజ్‌!– జాహ్నవి
‘సార్‌ అమ్మాయే కదా?’అయితే..?‘మీకు సిస్టర్స్‌ అంటే కొంచెం ఎక్కువ ప్రొటెక్షన్‌ ఫీలింగ్‌ కదా సార్‌?’అయితే..?‘లవ్‌ చేస్తోందంట సార్‌!’అయితే..?‘ఫ్రెండ్‌షిప్‌ పోకూడదంట సార్‌!’అయితే..?‘అడిగితే అంతా రంపరంప అయిపోతుందేమోనని కంగారు పడుతోంది సార్‌!’రంపరంపా..?‘ఏదోలే సార్‌.. ఇప్పుడు ఆ అమ్మాయికి లవ్‌ వద్దు అని సొల్లు కబుర్లు ముద్దుగా చెప్పి మీ అన్నయ్యతనాన్ని చాటి చెప్పుకోండిసార్‌!’ అబ్బాయిలు...‘సార్‌.. ఏమీ తెలియని ఆ అబ్బాయిని తిట్టకుండా సమాధానం చెప్పండి సార్‌!’అబ్బాయిలు రంపరంపగాళ్లు.. ఆడుకుంటారు.. నీకు దండం పెడతా.. బుద్దిగా చదువుకో బంగారం.. లవ్‌కి గివ్‌కి టైమ్‌ ఇంకా ఉంది. నీలాంబరికి నేను అబ్బాయిలను బ్యాడ్‌ బాయ్స్‌గాచేస్తానని కోపం.. కానీ అది కాదు! మీకు జరిగే అన్యాయం అబ్బాయిలకు జరగదు నాన్నా!! ఏదైనా పొరపాటు జరిగితే నువ్వు నీ ఫ్యామిలీ చాలా బాధపడుతుంది. ప్లీజ్‌ టేక్‌కేర్‌!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ,  సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com

Advertisement

తప్పక చదవండి

Advertisement