మైగ్రేన్ (పార్శ్వపు తలనొప్పి)

11 Dec, 2013 23:29 IST|Sakshi

తరచుగా తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే తలనొప్పికి చాలా కారణాలున్నాయి. రక్తపోటు, మెదడులో కణతులు, రక్తనాళాలలో రక్తప్రసరణలో మార్పులు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వల్ల, మగవారిలో రక్తపోటు, మానసిక ఒత్తిడి, మెదడులోని కణుతుల వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి స్త్రీలలో అధికంగా చూస్తుంటాం. ఈ నొప్పి చాలావరకు తలకు ఒక పక్క వస్తుంది. వాంతులూ ఉండవచ్చు. తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనయి వాచడం వల్ల ఈ నొప్పి వస్తుంది.
 
 పార్శ్వపు తలనొప్పికి కారణాలు
 పార్శ్వపునొప్పికి మానసిక ఆందోళన, ఒత్తిడి  ముఖ్య కారణాలు. అనవసరపు ఆలోచనలు, జరిగిపోయిన విషయాలను తరచుగా ఆలోచించడం వల్ల వస్తుంది.  
 డిప్రెషన్, నిద్రలేమి  
 కొందరిలో బయటకు వెళ్లినప్పుడు, సూర్యరశ్మి వల్ల  
 అధికంగా ప్రయాణాలు చేయడం వల్ల వస్తుంది.
 
 స్త్రీలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు, ఋతుచక్రం ముందుగా గాని, తర్వాత గాని వచ్చే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలో, స్త్రీలలో ఋతుచక్రం ఆగిపోయినపుడు. ఈ సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.
 
 ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటి కొన్ని రకాల మందులు వాడటం వల్ల వాడినప్పుడు కూడా రావచ్చు.
 
 మైగ్రేన్ దశలు - లక్షణాలు
 సాధారణంగా 24 - 72 గంటల్లో దానంతట అదే తగ్గవచ్చు.   
 ఒకవేళ నొప్పి 72 గంటలు ఉంటే స్టేటస్ మైగ్రేన్ అంటారు  
 మైగ్రేన్‌నొప్పి 4 దశలలో సాగుతుంది.
 
 ప్రొడ్రోమ్ ఫేజ్: ఇది నొప్పికి ముందు 2 గంటల నుంచి 2 రోజుల ముందు వరకు జరిగే ప్రక్రియల సమూహం. ఈ దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రెషన్, ఆలోచనలో మార్పులు రావడం, వాసన, వెలుతురు పడకపోవడం, మెడనొప్పి ఉంటాయి.
 
 ఆరా ఫేజ్: ఈ దశ నొప్పి ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు ఉంటుంది. చూపు మందగించడం, జిగ్ జాగ్ లైన్స్ కనిపించడం, తలలో సూదులు గుచ్చిన ఫీలింగ్, మాటల తడబాటు, కాళ్ళలో నీరసం ఉంటాయి.
 
 నొప్పిదశ:
ఈ నొప్పి దశ 2 గంటల నుంచి 3 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ దశలో వాంతులు ఉంటాయి. చాలా వరకు ఒకవైపునే ఉంటుంది. కాంతికి, ధ్వనికి చాలా సెన్సిటివ్‌గా అంటే చికాగ్గా అనిపిస్తుంది.  
 
 పోస్ట్‌డ్రోమ్ ఫేజ్: నొప్పి తగ్గిన తర్వాత కొద్దిరోజుల వరకు తల భారంగా అనిపిస్తుంది. ఒళ్లంతా నీరసంగా, నిరాసక్తంగా అనిపిస్తుంది.
 
 వ్యాధి నిర్ధారణ :  
 రక్త పరీక్షలు-సీబీపీ, ఈఎస్‌ఆర్   
 రక్తపోటును గమనించడం  
 ఈఈజీ పరీక్ష
 సిటీ స్కాన్ (మెదడు)  
 ఎంఆర్‌ఐ మెదడు పరీక్షలు ఉపకరిస్తాయి.
 
 మైగ్రేన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:  మానసిక ఆందోళనలు తగ్గించాలి.
 
 అతిగా ఆలోచనలు చేయకూడదు.  
 మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. దీనికోసం యోగా, ప్రాణాయామం చేయాలి.ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లక్షిస్తుంది.  
 తలకు నూనెతో మసాజ్ చేసుకుంటే తలలోని నరాలు రిలాక్సవుతాయి.
 
 తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, లైటు తీసేసి నిశ్శబ్దంగా ఉన్నచోట పడుకోబెట్టాలి.
 
 డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో),
 స్టార్ హోమియోపతి,
 సికింద్రాబాద్,  కూకట్‌పల్లి,
 దిల్‌సుఖ్‌నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, హన్మకొండ-వరంగల్, కర్ణాటక
 ph: 7416107107 / 7416 102 102
 www.starhomeo.com
 Email : info@starhomeopathy.com

 
 హోమియో వైద్యం
 మైగ్రేన్ తలనొప్పికి హోమియోలో మంచి మందులున్నాయి. ఘాటైన వాసనలు పీల్చినప్పుడు వస్తే, బెల్లడోనా, లైకోపోడియం, ఇగ్నిషియా ఇవ్వాలి. తరచు ఎక్కువగా వస్తుంటే - నాట్రంమూర్, సాంగ్యునేరియా, చైనా, సెపియా ఇవ్వాలి. గర్భవతుల్లో వస్తే బెల్లడోనా, నక్స్‌వామికా, సెపియా ఇవ్వాలి. ఎక్కువగా చదవడం వల్ల వస్తే కాల్కేరియా కార్బ్, నాట్రంమూర్, ట్యూబర్కిలినమ్. ప్రయాణాల వల్ల వస్తే - ఇగ్నిషియా, సెపియా, కాక్యులస్, కాలికార్బ్ ఇవ్వాలి. స్కూల్‌కి వెళ్లే ఆడపిల్లలలో వస్తే - కాల్కేరియాఫాస్, నాట్రంమూర్, పల్సటిల్లా ఇవ్వాలి. పైన తెలిపిన మందులు కేవలం అవగాహనకు మాత్రమే. వాటిని నిష్ణాతులైన హోమియో డాక్టర్‌ని సంప్రదించి మాత్రమే తీసుకోవాలి.
 

మరిన్ని వార్తలు