ప్రపంచంలోనే అరుదైన బ్లడ్‌ గ్రూప్‌ ఇదే.. వారిలో రిస్క్‌ తక్కువ

2 Nov, 2023 13:25 IST|Sakshi

మానన శరీరంలో అన్నింటికన్నా ముఖ్యమైనది రక్తం. ఊపిరితిత్తులోని గాలి నుంచి ఆక్సిజన్‌ను సేకరించి.. శరీరంలోని అన్ని కణాలకు అందించడమే రక్తం ప్రధాన కర్తవ్యం. అంతేకాదు శరీరంలో ఉత్పత్తైన కార్భన్ డయాక్సైడ్‌ను కూడా కణాల నుంచి తొలగిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం.. మానవ శరీరం సరిగ్గా పనిచేయాలంటే ఐదు లీటర్ల రక్తం అవసరం.

సాధారణంగా  మనుషుల్లో అనేక రకాల రక్త సమూహాలు (Human Blood Groups) కనిపిస్తాయి. A, B, AB, O పాజిటివ్.. అలాగే నెగెటివ్ గ్రూప్స్ ఉంటాయన్నది తెలిసిందే. వీటిలో రేర్‌ బ్లడ్‌ గ్రూప్‌ ఏది? ప్రపంచంలో ఏ బ్లడ్‌ గ్రూప్‌ వాళ్లు ఎంతెంత మంది ఉన్నారన్నది ఇప్పుడు చూద్దాం. 


మామూలు బ్లడ్ గ్రూపులలోని ఎర్ర రక్త కణాల్లో షుగర్ మాలిక్యుల్స్ ఉంటాయి. ఆ మాలిక్యుల్స్‌ని బట్టి బ్లడ్‌ గ్రూపులను నిర్ణయిస్తారు. A- యాంటిజన్ ఉంటే A గ్రూపు, B-యాంటిజన్ ఉంటే B గ్రూపు, రెండూ ఉంటే AB గ్రూపు, అవేవీ లేకపోతే O గ్రూపుగా పరిగణిస్తారు. అలాగే ఎర్ర రక్త కణాలపై RH ప్యాక్టర్ ఉంటే పాజిటివ్‌గా లేకపోతే నెగిటివ్‌గా భావిస్తారు.

Group A –ఇందులో యాంటిజన్‌ A, యాంటిబాడీస్‌ B ఉంటుంది

Group B –యాంటిజన్‌ B and యాంటిబాడిస్‌ A ఉంటుంది

Group AB –యాంటిజన్స్‌ AB ఉంటుంది కానీ యాంటిబాడీస్‌ ఉండవు (neither A nor B).

Group O –  యాంటిజన్స్‌ ఉండవు కానీ AB యాంటిబాడీస్‌ ఉంటాయి. 


వరల్డ్ పాపులేషన్ రివ్యూ  అందించిన వివరాల ప్రకారం..
ఏ బ్లడ్‌ గ్రూప్‌ వాళ్లు ఎంతెంత మంది ఉన్నారంటే.
.

O పాజిటివ్ బ్లడ్:  42% 
A పాజిటివ్ బ్లడ్:  31%
B పాజిటివ్ బ్లడ్:  15%
AB పాజిటివ్ బ్లడ్ :  5%
O నెగిటివ్ బ్లడ్ :  3%
A నెగిటివ్ బ్లడ్ : 2.5%
B నెగిటివ్ బ్లడ్ : 1%
AB నెగిటివ్ బ్లడ్ : 0.5% మందిలో ఉంది. 

ఈ గణాంకాలు బట్టి అరుదైన బ్లడ్ గ్రూపులు ఏంటన్నది సులభంగా అర్థమవుతోంది. దేశంలో B నెగిటివ్ బ్లడ్ కేవలం 1% మందిలోనే ఉండగా, అత్యల్పంగా AB నెగిటివ్ బ్లడ్ 0.5% మందిలో ఉంది. దీంతో దీంతో అత్యవసర సమయాల్లో దాతల నుంచి రక్తం లభించడం చాలా కష్టతరంగా ఉంటుంది. ఒక్కోసారి సమయానికి సమయానికి రక్తం లభించక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అందుకే B నెగిటివ్, AB నెగిటివ్ బ్లడ్ గ్రూపులను అరుదైన బ్లడ్‌ గ్రూప్స్‌గా పేర్కొంటారు. 

అన్ని బ్లడ్‌ గ్రూప్స్‌లో కంటే O పాజిటివ్ బ్లడ్‌ ఉన్నవారు ఎవరికైనా రక్తాన్ని దానం చేయవచ్చు. అందుకే వీరిని యూనివర్సల్‌ డోనర్స్‌ అంటాం. అంతేకాకుండా మిగిలిన బ్లడ్ గ్రూపుల వారికంటే వీరికి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తక్కువని పలు పరిశోధనల్లో వెల్లడైంది. భారత్‌లో O(+,-) బ్లడ్ గ్రూప్‌ ఉన్నవారు సుమారు 29% మంది ఉండగా అత్యధికంగా పెరు దేశంలో O(+,-) బ్లడ్ గ్రూప్‌ ఉన్నవారు 71% మంది ఉండటం విశేషం. 

మరిన్ని వార్తలు