చౌకగా కేన్సర్‌ వ్యాధి నిర్ధారణ...

25 Jul, 2019 09:14 IST|Sakshi

కేన్సర్‌ మహమ్మారిని నిర్ధారించుకునేందుకు ఎంతో ఖర్చు అవుతున్న ఈ రోజుల్లో మైక్రోఫ్లూయిడిక్స్‌ టెక్నాలజీతో దీన్ని కారు చౌక చేసేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. మనిషి వెంట్రుక మందమంత చిన్న చిన్న కాలువల్లాంటి నిర్మాణాలతో కూడిన ల్యాబ్‌ ఆన్‌ చిప్‌ పరికరాలతో కేన్సర్‌ను సులువుగా గుర్తించవచ్చునని సిప్రియాన్‌ ఇలిస్క్యూ అనే రొమేనియన్‌ శాస్త్రవేత్త చెబుతున్నారు. అంతేకాకుండా.. ఈ ల్యాబ్‌ ఆన్‌ చిప్‌లు ఒక్కో వ్యక్తికి తగిన వైద్యం అందించేందుకు కూడా ఉపయోగపడతాయని చెప్పారు. మైక్రోఫ్లూయిడిక్స్‌ అభివద్ధిపై బయో మైక్రోఫ్లూయిడిక్స్‌ అనే జర్నల్‌లో ప్రచురితమైన వివరాలు ఇలా ఉన్నాయి. కొన్ని కణాలను వేరుచేసి ఈ చిప్‌లలోకి పంపి... కేన్సర్‌ మందులను వాటిపై ప్రయోగించవచ్చునని... తద్వారా అవి ఎంత ప్రభావం చూపుతున్నాయో తెలుసుకుని అందుకు అనుగుణంగా ఆయా మందులను వాడకం మొదలుపెట్టవచ్చునని సిప్రియాన్‌ వివరిస్తున్నారు. ఈ ల్యాబ్‌ ఆన్‌ చిప్స్‌ రక్తం, లాలాజలం, స్వేదం, మూత్రం వంటి పలు జీవ ద్రవాలను విశ్లేషించగలదని.. కేన్సర్‌ కణితులు విడుదల చేసే నిర్దిష్ట కణాలు, ప్రొటీన్లు, కణజాలాలను గుర్తించగలదని వివరించారు. లిక్విడ్‌ బయాప్సీ అని పిలిచే ఈ పద్ధతి వల్ల రోగికి ఇబ్బందులు తగ్గడమే కాకుండా.. శరీరం మారుమూలల్లోని కణితులను కూడా గుర్తించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. కేన్సర్‌ ఏ అవయవంలో మొదలైంది.. ఇతర అవయవాలకు విస్తరించిందా? లేదా? అన్నది కూడా ఈ చిప్స్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జాబిల్లిపై మరింత నీరు!

క్యాన్సర్‌... అందరూ తెలుసుకోవాల్సిన నిజాలు

అతడామె! జెస్ట్‌ చేంజ్‌!

ఆరోగ్య ‘సిరి’ధాన్యాలు

ఒకేలా కనిపిస్తారు.. ఒకేలా అనిపిస్తారు

షూటింగ్‌లో అలా చూస్తే ఫీలవుతాను

ఇదీ భారతం

మూర్ఛకు చెక్‌ పెట్టే కొత్తిమీర!

మంచి నిద్రకు... తలార స్నానం!

నేత్రదానం చేయాలనుకుంటున్నా...

హలో... మీ అమ్మాయి నా దగ్గరుంది

రియల్‌ లైఫ్‌ లేడీ సింగం

కోటల కంటే ఇల్లే కష్టం

గర్భవతులకు నడక మంచి వ్యాయామం!

ఇక ద్రవాలూ అయస్కాంతాలే!

కీళ్ల కదలికలతోనూ విద్యుత్తు...

అమ్మాయికి మొటిమలు వస్తున్నాయి..?

వెనిస్‌ వాకిట్లో బాంబే రోజ్‌

కొత్త గర్ల్‌ ఫ్రెండ్‌... కొత్త బాయ్‌ఫ్రెండ్‌

‘జంకు’.. గొంకూ వద్దు!

హాహా హూహూ ఎవరో తెలుసా?

కడుపులో కందిరీగలున్న  స్త్రీలు

ఖాళీ చేసిన మూల

మెరిసే చర్మం కోసం..

బరువును సులువుగా తగ్గించే చనాచాట్‌

రుచుల్లో "మున"గండి...

కొవ్వుకణాలతో కేన్సర్‌కు మందులు

సింగపూర్‌లో శాకాహార హోటల్‌

సరయు : డాన్స్‌, ఫైట్స్‌, ఆర్ట్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడు సంతానంపై ఫిర్యాదు

అక్కడ కూర్చుని హోమ్‌ వర్క్‌ చేసుకునేదాన్ని

విమర్శ మంచే చేసిందన్నమాట..

విజయ్‌ @ 800

ఆపరేషన్‌ సక్సెస్‌

వందలో ఒక్కరు!