మీపై ఒత్తిడి పెరుగుతోందా?

18 Oct, 2017 00:58 IST|Sakshi

సెల్ఫ్‌చెక్‌

పని, మానసిక సమస్యలు కారణం ఏదైనా కావచ్చు, ఈ రోజుల్లో ఒత్తిడి సాధారణం అయ్యింది. మ్యూజిక్‌ వినటం, సినిమాలు చూడటం ఇలా ఏదోఒక రకంగా కొందరు స్ట్రెస్‌ను తగ్గించుకొనే ప్రయత్నం చేస్తారు. ఇలా చేయలేనివారు ఆందోళనను అదుపులో పెట్టుకోలేరు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. స్ట్రెస్‌వల్ల మీరూ సిక్‌గా మారారేమో, చెక్‌ చేసుకోండి.

1.    రెస్ట్‌ తీసుకొనే సమయం దొరికి నా సరిగా నిద్రపోలేక పోతున్నారు.
    ఎ. కాదు     బి. అవును

2.    స్ట్రెస్‌ నుంచి దూరం అవ్వటానికి మద్యం అలవాటు నేర్చుకోవాలనిపిస్తోంది.
    ఎ. కాదు     బి. అవును

3.    చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉన్నా మీరు మాత్రం ఎప్పుడూ మూడీగానే ఉంటున్నారు.
    ఎ. కాదు     బి. అవును

4.    తరచుగా అలసిపోయినట్లు ఉండటం వల్ల  పనిని మధ్యలోనే వదిలివేయవలసి వస్తోంది.
    ఎ. కాదు     బి. అవును

5.    కోపాన్ని అణచుకోవటం చాలా కష్టంగా మారింది.
    ఎ. కాదు     బి. అవును

6.    ఆందోళనలో గందరగోళానికి గురవుతున్నారు.
    ఎ. కాదు     బి. అవును

7.    ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోమని, మీ శ్రేయోభిలాషులనుంచి సూచనలు అందుతున్నాయి.
    ఎ. కాదు     బి. అవును

8.    ఆహారం మరీ ఎక్కువ లేదా తక్కువగా తీసుకుంటున్నారు.
    ఎ. కాదు     బి. అవును

9.    ఏ పని మీదా శ్రద్ధ చూపలేకపోతున్నారు.
    ఎ. కాదు     బి. అవును

10.    మతిమరుపు వస్తోంది, ఎక్కుసార్లు తలనొప్పితో బాధపడుతున్నారు.
    ఎ. కాదు     బి. అవును

‘బి’ సమాధానాలు నాలుగు వస్తే మీరిప్పుడిప్పుడే ఒత్తిడికి గురవుతున్నారు. దీనిని మొదట్లోనే నియంత్రించుకోండి. ‘బి’ లు ఏడు దాటితే ఆందోళనవల్ల మీరు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతుంటారు. వెంటనే ఒత్తిడిని నియంత్రించుకోగలిగే మార్గాలను తెలుసుకొని వాటిని ఫాలో అవ్వండి. ‘ఎ’ లు ఏడు అంత కన్నా ఎక్కువగావస్తే మీలో ఆందోళనకు తావులేదు.

మరిన్ని వార్తలు