కంటి నిండా నిద్ర కరవయిందా?

22 Sep, 2017 21:04 IST|Sakshi
కంటి నిండా నిద్ర కరవయిందా?

సెల్ఫ్‌ చెక్‌

చాలామంది తరచూ ఒత్తిడికి, ఆందోళనకు గురవుతున్నా, అందుకు సరైన నిద్రలేకపోవడం కూడా ఒక కారణమనుకోరు. మీకు కూడా నిద్ర రాని సమస్య ఉందా? తెలుసుకోవాలంటే ఈ సెల్ఫ్‌చెక్‌ పూర్తి చేయండి.

1.    రాత్రి వేళ నడుం వాల్చాక గంటలకొద్దీ నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు.
    ఎ. అవును      బి. కాదు  

2.    పగలు కాస్త కుదురుగా కూర్చుంటే చాలు, నిద్ర ముంచుకొచ్చేస్తుంటుంది.
    ఎ. అవును      బి. కాదు  

3.    అర్ధరాత్రి మెలకువ వస్తే మళ్లీ నిద్రపోలేరు.
    ఎ. అవును      బి. కాదు  

4.    పగలు చాలా ఆందోళనగా, చికాకుగా ఉంటారు.
    ఎ. అవును      బి. కాదు  

5.    మీటింగ్‌లలో వద్దనుకున్నా నిద్ర వస్తుంది.
    ఎ. అవును      బి. కాదు  

6.    డ్రైవ్‌ చేస్తున్నప్పుడో, బస్సులో వెళుతున్నప్పుడో ఇట్టే నిద్ర వచ్చేస్తుంది.
    ఎ. అవును      బి. కాదు  

7.    నిద్రలేవగానే మీరు ఫ్రెష్‌నెస్‌ ఫీల్‌ కారు.
    ఎ. అవును      బి. కాదు  

8.    నిద్రలో గురకపెడతారని సన్నిహితులు మీకు చెబుతుంటారు.
    ఎ. కాదు      బి. అవును  

9.    పనిపై ఏకాగ్రత చూపలేరు.
    ఎ. అవును      బి. కాదు  

10.    స్లీపింగ్‌ పిల్స్‌ తరచూ వాడుతుంటారు.
    ఎ. అవును      బి. కాదు  

‘ఎ’ లు 7 దాటితే మీరు నిద్ర కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారని అర్థం. ఇందుకు కారణాలేమిటో విశ్లేషించి, తగిన చర్యలు తీసుకోవాలి.. ‘బి’లు 7 కన్నా ఎక్కువ వస్తే  నిద్ర గురించి ఆందోళన చెందనక్కర లేదు.

మరిన్ని వార్తలు