ప్రివెన్షన్ బెస్ట్ మెడిసిన్...

22 Feb, 2016 23:06 IST|Sakshi
ప్రివెన్షన్ బెస్ట్ మెడిసిన్...

ఎగ్జామ్ టిప్స్
 
రోజూ 3-4 లీటర్ల వరకు నీళ్లు, పళ్లరసాలు తాగిస్తుండాలి. మధుమేహం వంటి సమస్యలున్న పిల్లలకు మాత్రం వైద్యుల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్డు పక్కన బండ్ల మీద పండ్లరసాలను, ఆహారపదార్థాలను తీసుకోనివ్వకూడదు. కలుషిత నీరు, ఆహారం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి సమస్యలు బాధిస్తుంటాయి. ఈ విషయంలోనూ, చేతుల శుభ్రత పాటించడంలోనూ పిల్లలకు సరైన అవగాహన తల్లిదండ్రులు, టీచర్లు కలిగించాలి. జలుబు నుంచి రిలీఫ్ కలగాలంటే బాగా మరిగించిన నీటితో ఆవిరిపట్టాలి. పరీక్షలు ఉన్నన్ని రోజులు రోజూ ఉదయం, రాత్రి పడుకునేముందు ఉప్పునీటితో నోటిని పుక్కిలించమనాలి. ఇలా గార్గిల్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ సమస్యలు బాధించవు.

చదవాలి కదా.... అని తెల్లవార్లూ కూర్చోబెట్టకుండా పిల్లలకు తగినంత నిద్ర అవసరం అని గుర్తించాలి. పరీక్ష అయిపోయిన తర్వాత రెస్ట్ ఇవ్వాలి.   ఉదయం, సాయంత్రం వేళల్లో చల్లదనానికి దోమలు విపరీతంగా ఇళ్లల్లోకి  చేరుతుంటాయి. కిటికీలు మూయడం, దోమల మందులు, నెట్‌లు వాడటం చేయాలి. జ్వరంగా ఉన్నప్పుడు తడిబట్టతో ఒళ్లు తుడవడం, వైద్యుల సలహాతో మందులు వాడటం తప్పనిసరి.పరీక్షలు లేని రోజుల్లో దగ్గు, తుమ్ములు సమస్య ఉన్నప్పుడు ఒకటి రెండు రోజుల్లో పిల్లల్ని స్కూల్‌కి పంపించకూడదు. ఒకరికి ఈ సమస్య ఉంటే తరగతిలో మిగతా పిల్లలకూ సోకే అవకాశం ఉంటుంది. దగ్గు, తుమ్ము వచ్చేటప్పుడు చేతిగుడ్డ అడ్డుగా పెట్టుకొమ్మని పిల్లలకు ముందుగానే చెప్పాలి. తాజా ఆహారపదార్థాలుగా కూరగాయలు, పండ్లు, విటమిన్ సి సమృద్ధిగా ఉండే వాటిని ఇవ్వాలి.
 

మరిన్ని వార్తలు