హంగేరీ

21 Mar, 2015 22:31 IST|Sakshi
హంగేరీ

ప్రపంచ వీక్షణం
నైసర్గిక స్వరూపం
 

ఖండం: యూరప్
వైశాల్యం:  93,030 చదరపు కిలోమీటర్లు
జనాభా:  98,77,365 (తాజా అంచనాల ప్రకారం)
రాజధాని: బుడాపెస్ట్
ప్రభుత్వం: యూనిటరీ పార్లమెంటరీ కాన్‌స్టిట్యూషనల్ రిపబ్లిక్
కరెన్సీ: ఫోరింట్
భాష: మాగ్యార్ (హంగేరియన్)
మతం: క్రైస్తవులు
వాతావరణం: జనవరిలో-4 నుండి 1 డి గ్రీ వరకు, జులైలో 16 నుండి 28 డిగ్రీల వరకు.
పంటలు: తృణధాన్యాలు, బంగాళదుంపలు, చెరుకు, కూరగాయలు, పళ్లు, ద్రాక్ష.
పరిశ్రమలు: ఇనుము, ఉక్కు పరిశ్రమలు, దుస్తులు, రసాయనాలు, యంత్ర పరికరాలు, రవాణా పరికరాలు, కలప ఉత్పత్తులు, గనులు.

 ఎగుమతులు:  ఆహార ఉత్పత్తులు, యంత్ర పరికరాలు, రసాయనాలు, మోటారు వాహనాలు, దుస్తులు, ఇనుము, ఉక్కు.
స్వాతంత్య్రం: అక్టోబర్ 23, 1989.
సరిహద్దులు: చెకొస్లోవేకియా, రష్యా, రొమేనియా, యుగొస్లావియా, ఆస్ట్రియా.
 
చరిత్ర

వెయ్యి సంవత్సరాల కిందటే ఈ దేశపు పునాదులు ఏర్పడ్డాయని చర్రిత చె బుతోంది.  క్రీస్తుశకం 896 లో మాగ్యార్‌లు అనే రష్యా దేశపు స్టెప్పీలు డాన్యూబ్ నది తీరం గుండా వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరు నిజానికి దేశ దిమ్మరులు. గుర్రాలను పెంచుకోవడం వీరికి వృత్తి. వీళ్లకు నాయకుడు అర్పాడ్, ఇతను ప్రస్తుత హంగేరీ దేశపు పశ్చిమ భాగాన్ని ఆక్రమించి పరిపాలించాడు. మొట్టమొదటి హంగేరియన్ సామ్రాజ్యం మాగ్వార్ రాజు స్టీఫెన్ నాయకత్వంలో క్రీస్తుశకం 1000 శతాబ్దంలో ఏర్పడింది. ఈ సామ్రాజ్యం క్రమంగా విస్తరించింది. అయితే మధ్య మధ్యన తుర్కులు దాడులు చేస్తూ ఉండేవారు. చివరికి వీరు హంగేరీ మధ్య భూభాగాన్ని ఆక్రమించుకొని 150 సంవత్సరాలు పరిపాలన చేశారు. వీరు 16, 17 శతాబ్దాలలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు.

ఆస్ట్రియాను పరిపాలిస్తున్న హప్స్‌బర్గ్ పాలకులు ఈ తుర్కుల మీద క్రమంగా దాడులు చేసి క్రీస్తు శకం 1699లో హంగేరీ దేశాన్ని పూర్తిగా ఆక్రమించారు. 1848 లో ఆస్ట్రియా స్వాతంత్య్ర పోరాటాన్ని వీరు రష్యా సహకారంతో అణచి వేశారు. అయితే మాగ్యార్‌లు తను అస్తిత్వాన్ని చాటుకోవడానికి హప్స్‌బర్గ్ పాలకుల మీద తిరుగుబాటు ఫలితంగా 1867లో ద్వంద్వ పాలన చేయాలని నిర్ణయం జరిగింది. దాని ఫలితంగా ఆస్ట్రో హంగేరీ రాజ్యపాలనలో మాగ్యార్‌లతో పాటు చెకొస్లోవేకియన్లు, స్లోవేనియన్లు, సెర్బ్‌లు కూడా భాగస్వాములు అయ్యారు.

మొదటి ప్రపంచయుద్ధం తరువాత హాప్స్‌బర్స్ రాజ్యం కూలిపోయింది. ఫలితంగా హంగే రీ తన భూభాగాన్ని ఒక వంతు చెకోస్లోవేకియాకు, రుమేనియాకు, యుగొస్లోవియాకు కోల్పోయింది. 1930 దశకంలో హంగేరీ, జర్మన్ ఆధిపత్యంలో పని చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో హంగేరీ జర్మనీతో కలిసి రష్యాపై యుద్ధం చేసింది. అయితే రెండో ప్రపంచయుద్ధం పూర్తయ్యాక చిత్రంగా హంగేరీ రష్యాకు అనుకూలంగా మారిపోయింది.
 
ప్రజలు - సంస్క ృతి

 హంగేరీ ప్రజలు తమ పూర్వపు మాగ్యావర్ సంస్కృతిని, ఆ భాషను, అప్పటి ఆహార రీతులను, పురాతన జాపపద సంగీతాన్ని ఎంతో ఇష్టపడతారు. హంగేరియన్లు భోజనాన్ని చాలా సుష్టుగా తింటారు. బాగా తాగుతారు కూడా! పాప్రికా అనే ఆహారాన్ని బాగా తింటారు. టోకాజ్, బుల్స్‌బ్లడ్ అనే పేరు గల వైన్ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. ప్రజలు కూడా వీటికి అధికంగా ఉపయోగిస్తారు. భార్యాభర్తలిద్దరూ పనికి వెళ్లడం ఇక్కడ రివాజు. జాతీయ, ప్రాంతీయ ఉత్సవాలలో జానపద గీతాలు, నృత్యాలు ఇక్కడ సర్వసాధారణం.
 నగరాలలో మహిళలు జీన్స్, సూట్స్ ధరిస్తారు. ఎంబ్రాయిడరీ చేసిన, లేసులతో అల్లిన టోపీ మహిళలు సాధారణంగా ధరిస్తారు. ఉర్గోస్, కరికాజో, సర్దాస్ అనే పేర్లు గల నృత్యాలు బాగా ప్రాచూర్యంలో ఉన్నాయి.ఇక హంగేరీయన్లు తమ శరీరాలను మర్దన చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. మర్దన కోసం ‘స్పా’లు ప్రతిచోటా అందుబాటులో ఉంటాయి.
 
దేశ పరిపాలనా రీతులు - ప్రత్యేకతలు


హంగేరీ దేశం పరిపాలనా సౌలభ్యం కోసం 19 కౌంటీలుగా విభజింపబడింది. ఈ 19 కౌంటీలు తిరిగి 198 రైడింగ్‌లుగా విభజింపబడ్డాయి. దేశం మొత్తంలో 20 నగరాలు అతి పెద్దవిగా చలామణి అవుతున్నాయి.  వీటిలో బుడాపెస్ట్, డెబ్రెసెన్, మిస్కోల్క్, జెగెడ్, పెక్స్, గ్యోర్, నిరె గీజా, మొదలైనవి పెద్ద జనాభాలో ఉన్నాయి.
 దేశంలో రొమేనియన్లు, జర్మన్లు, స్లోవాక్‌లు, రొమేనియన్ల జనాభా కూడా బాగా ఉంది.

1.    {పపంచం మొత్తంలో కుర్రకారుకు ఇష్టమైన రూబిక్ క్యూబ్‌ను కనిపెట్టిన వ్యక్తి ఈ దేశానికి చెందినవాడే. అతడి పేరు ఎర్నో రూబిక్, 1974లో అతడు క్యూబ్‌ను కనిపెట్టాడు. అదే రూబిక్ క్యూబ్.
2.    ‘విటమిన్ సి’ ని కనిపెట్టిన అల్బర్ జెంట్ ఈ దేశానికి చెందిన వాడు. అతడి కి 1937లో  నోబెల్ బహుమతి లభించింది.
3.    ప్లాస్మో టీవిని 1936లో ఈ దేశానికి చెందిన శాస్త్రవేత్త కల్మన్ తిహాన్యీ దానిని కనిపెట్టాడు.
4.    మనం విరివిగా ఉపయోగిస్తున్న బాల్ పాయింట్ పెన్నును లాస్‌జ్లో బైరో అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు. అతడు ఈ దేశస్థుడే.
5. ప్రపంచ ప్రసిద్ధి చెందిన హ్రైడోజన్ బాంబును ఈ దేశస్థుడైన ఎడ్వర్డ్ టెల్లర్ కనిపెట్టాడు.
 
చూడదగిన ప్రదేశాలు  బాలాటన్ సరస్సు


బాలాటన్ సరస్సు - ఆ సరస్సులో ఉన్న ద్వీపగ్రామం. గ్రామంలో ఉన్న 17వ శతాబ్దపు బెనెడిక్ట్ ఆబే చూడద గ్గవి. దాదాపు 598 చదరపు కిలోమీటర్లు వెడల్పు ఉన్న  సరస్సు నీలి ఆకాశపు రంగును కలిగి ఉండి సందర్శకులను మంత్రముగ్థులను చేస్తుంది. దేశం మొత్తంలో ఒక అద్భుతమైన టూరిస్టు ప్రదేశం ఇది. ఇక్కడ ఒక ఓడరేవు కూడా ఉండడం ఒక విశేషం. ఈ సరస్సునే హంగేరీయన్ సముద్రం అని ముద్దుగా పిలుస్తుంటారు. ఈ  సరస్సు చుట్టూ 130 బీచ్‌లు ఉన్నాయి. సరస్సు రెండువైపులా అనేక చిన్న చిన్న గ్రామాలు, రిసార్టులు నిండి ఉన్నాయి. ఇక్కడ సంవత్సరం పొడవునా యాత్రికులు సందడి చేస్తుంటారు. చిన్న చిన్న గుహలు, ఎకో హిల్, సక్స్ హిల్, అబే, ఇంకా సరస్సు చుట్టూ దాదాపు 30 చిన్న గ్రామాలు నెలకొని ఉన్నాయి.
 
బుడాపెస్ట్

హంగేరీ దేశాన్ని దర్శించడానికి ప్రపంచ వ్యాప్తంగా సందర్శకులు వస్తూ ఉంటారు. సందర్శకుల రాకడలో ఈ దేశం ప్రపంచంలో పదమూడవ స్థానంలో ఉంది. దేశ రాజధాని బుడాపెస్ట్ సంవత్సరం పొడవునా సందర్శకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఇక్కడ చారిత్రక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వియన్నా గేట్ స్క్వేర్‌లు ఉన్న వరుస గృహాలు, సండోర్ రాజభవనం ఇప్పుడిది అధ్యక్ష భవనంగా మారింది. వర్కర్ట్ కాసినో, 17వ శతాబ్దంలో నిర్మించిన పెటెర్ఫీ ప్యాలెస్, గ్రేషుమ్ ప్యాలెస్, హంగేరియన్ అకాడమీ ఆఫ్ సెన్సైస్, బుడా క్యాజిల్, స్టేట్ ఓపెరా హవుస్ గోల్డ్ మ్యూజియం, బాహవుస్ విల్లాలు, సిటీ పార్క్, ఇన్నర్ సిటి పరిశ్ చర్చి, కేవ్ చర్చి, లిబర్టీ విగ్రహం, లిబర్టీ బ్రిడ్జి, హీరోస్ స్క్వేర్, గ్రేట్ మార్కెట్ హాల్, మిల్లేనియం పార్లమెంట్ బిల్డింగ్ సెయింట్ స్టీఫెన్ బాసిలికా, గుల్ బాబా టోంబ్,
 సెయింట్ ఇస్త్వాన్ బాసిలికా, డాన్యూబ్ నది మీద నిర్మించిన వివిధ వంతెనలను తప్పక చూడాల్సిందే. మొత్తం ఏడు బ్రిడ్జిలు, ఏడు విధాలుగా ఉంటాయి.
 
ఎగెర్


ఈ చారిత్రాత్మక నగరం దేశ ఉత్తర ప్రాంతంలో ఉంది. ఈ నగరం మాట్రాబక్ అనే రెండు పర్వతాల మధ్య ఉంది. ఈ నగర  ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా అద్భుత శైలిలో శతాబ్దాల క్రితం నిర్మించిన క్యాజిల్‌లు, ధర్మల్ బాత్ ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ముఖ్యంగా టర్కిష్ ప్రజలు తమ ఉనికి తెలుపుకోవడానికి దశాబ్దాల క్రితం నిర్మించిన ఒంటి స్తంభ మినరెట్ నగరానికి ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ స్తంభం 42 మీటర్ల ఎత్తు ఉంటుంది. లోపలి నుండి పైవరకు ఎక్కడానికి  97 మెట్లు ఉంటాయి. నగరంలో సెర్బియన్‌ల చర్చి రెక్టెంప్లమ్ మరో ప్రత్యేక ఆకర్షణ. ఇక వైన్ మ్యూజియం మద్యం ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తుంది. పిర్కర్ ప్రాంతంలో నిర్మించిన బాసిలికా ఒక గొప్ప కట్టడం.  నగరంలో ఇళ్లు సాధారణంగా రెండు లేదా మూడు అంతస్తుల్లో ఉంటాయి. ఇంటి పైకప్పులన్నీ దాదాపు ఎరుపు రంగుతో ఉంటాయి. దూరం నుండి చూస్తే ఎరుపుదనం పరుచుకున్నట్లు కనబడుతుంది.
 
మొహాక్స్

ఈ నగరం డాన్యూబ్ నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో పదిహేను, పదహారు శతాబ్దాలలో రెండు యుద్ధాలు జరిగాయి. మొదటిది క్రీ.శ.1526లో జరిగింది. ఈ యుద్ధంలో ఒట్టోమాన్ రాజులు గెలిచి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు.  రెండవది క్రీ.వ. 1687 లో జరిగింది. ఈ యుద్ధంలో ఒట్టోమాన్ రాజులు ఓడిపోయి కనుమరుగైపోయారు. ఓట్టోమాన్ రాజులు ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఆనాటి ఆనవాళ్లు నేటికీ మనకు కనిపిస్తాయి. ఈ నగరంలో ఆనాడు యుద్ధాలలో మరణించిన 1700 మంది సైనికులకు గుర్తుగా మొహాక్స్ టార్టెనెల్మి ఎమ్లెంఖేమి అనే నిర్మాణం నేటికి నిలిచి ఉంది.    
 
ఈ నగరం ప్రతి వసంత మాసంలో బుసోజరాస్ కార్నివాల్ పండగ జరుగుతుంది. నగరం మధ్యలో టౌన్‌హాల్ భవనం, దాని నిర్మాణం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి. మెమోరియల్ పార్క్, డాన్యూబ్ నది పరవ ళ్లు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ నగరం నుండి ముగ్గురు వ్యక్తులు ప్రపంచానికి చాటి చెప్పారు. వారితో ఫెరెంక్ ఫాఫ్ గొప్ప ఆర్కిటెక్ట్, ఎండ్రేరోజ్దా ప్రపంచ ప్రసిద్ధ పెయింటర్, నోర్‌బర్ట్ మిచెలిస్ ఒక గొప్ప రేసింగ్ డ్రైవర్.

మరిన్ని వార్తలు