Sakshi News home page

వావ్‌...అందరి చూపు ఆకాశానికే..మన చిరుతల వేగం చూడండి!

Published Mon, Aug 28 2023 11:18 AM

World Athletics Championships 2023 India Mens 4x400m Record what anand Mahindra says - Sakshi

ఆసియా రికార్డు బద్దలుకొట్టిన భారత పురుషుల అథ్లెటిక్స్ బృందంపై వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. సైన్స్‌, విజ్ఞాన విషయాలపైనే కాదు తరచుగా క్రీడా వార్తులు విశేషాలపై తరచుగా స్పందించే ఆయన తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ 4X400 మీటర్ల విభాగంలో భారత పురుషుల రిలే జట్టు ఫైనల్‌కు క్వాలిఫై కావడంపై తన సంతోషాన్ని ఎక్స్‌(ట్విటర్‌) ప్రకటించారు. కానీ అయితే ఈ ఆదివారం జరిగిన ఫైనల్లో  మనవాళ్లు  ఐదో స్థానాన్ని మాత్రమే సాధించగలిగారు. ఈ విభాగంలో అమెరికా స్వర్ణం, ఫ్రాన్స్ రజతం, గ్రేట్ బ్రిటన్ కాంస్య పతకాలను గెల్చుకున్నాయి.  

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు అర్హత సాధించిడం, ఆసియా రికార్డుపై స్పందించిన ఆనంద్‌ మహీంద్ర వావ్‌.. చూస్తోంటే.. అందరూ ఇప్పుడు మూన్‌ వైపే గురి పెట్టినట్టున్నారు. చిరుతల్లా దూసుకుపోతున్న మన అథ్లెటిక్స్‌ని చూడండి అంటూ ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా షేర్‌  చేశారు.

మరోవైపు ఆదివారం హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియా తొలి బంగారు పతకాన్ని దక్కించుకుంది.  జావెలిన్‌ త్రోలో  స్వర్ణ పతకాన్ని సాధించి గోల్డెన్‌ బాయ్‌  నీరజ్‌ చోప్రా మరో ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. 

కాగా వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో పురుషుల 4X400 మీటర్ల  విభాగంలో ఇంటియన్‌ టీం మహ్మద్ అనాస్, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్, రాజేశ్ రమేశ్‌ చిరుతల్లా విజృంభించి కేవలం 2 నిమిషాల 59.05 సెకన్లలోనే రేసు ముగించి ఫైనల్‌కు అర్హత సాధించి అందరిదృష్టినీ ఆకర్షించారు. అంతేకాదు వరల్డ్ అథ్లెటిక్స్‌లో ఈ విభాగంలో భారత్ ఫైనల్స్‌కు క్వాలిఫై  అవడం ఇదే తొలిసారి కావడం విశేషం. 

Advertisement

What’s your opinion

Advertisement