కరోనా: ఇరాన్‌ పరేడ్‌ 

21 Apr, 2020 07:03 IST|Sakshi

టెహరాన్: అవసరమైన ఆయుధం ఏదో, అహంకార ప్రదర్శన ఏదో ప్రపంచానికి ఇప్పుడు తెలిసి వస్తోంది. అసలైన శత్రువులు విపత్తులేనని సాటి దేశాలు కాదని గుర్తిస్తున్నాయి. అందుకు నిదర్శనమే శనివారం (ఏప్రిల్‌ 18) నాడు జరిగిన ఇరాన్‌ ఆర్మీ డే పరేడ్‌. ఆయుధ సంపత్తిని ప్రదర్శించే సంప్రదాయానికి భిన్నంగా ఈసారి ఇరాన్‌ రోగ క్రిమి సంహారక వాహనాలు, సంచార ఆసుపత్రులు, వైద్య చికిత్సా పరికరాలను పరేడ్‌ చేయించింది. ఆర్మీ కమాండర్‌ లు ముఖాలకు మాస్కులు ధరించి ఈ పరేడ్‌కు హాజరయ్యారు. సాధారణంగా ఆర్మీ డే పరేడ్‌ లో శతఘ్నులు, సాయుధ కవచ శకటాలు ఉంటాయి. అలా కాకుండా కరోనాపై యుద్ధంలో సైన్యం కీలకమైన పాత్ర పోషించవలసి ఉంటుందని చెప్పడానికి ఇరాన్‌ ఇలా సంకేతాత్మకంగా ‘ఆరోగ్య అత్యవసర స్థితి’ని ప్రదర్శనకు పెట్టింది.  

మరిన్ని వార్తలు