పెళ్లయితే... ప్రేమ మాయమవుతుందా?

10 Mar, 2014 23:17 IST|Sakshi
పెళ్లయితే... ప్రేమ మాయమవుతుందా?

బాగా ప్రేమించుకున్నవాళ్లు పెళ్లి చేసుకుంటే? ‘పెళ్లి దెబ్బకు ప్రేమ మాయమైపోతుంది’లాంటి సరదా కామెంట్లు నేను చాలా విని ఉన్నాను. గోల్డీ, నేనూ అయిదేళ్ళ పాటు స్నేహితులుగా, ప్రేమికులుగా తిరిగాం. పెళ్లికి ముందు నాకు చిన్న సందేహం వచ్చింది.
 ‘పెళ్లయిన తరువాత కూడా ఈ ప్రేమ ఇలాగే ఉంటుందా?’ అని. కచ్చితంగా ఉంటుందని మా వివాహబంధం నిరూపించింది.

  చిన్నవయసులోనే తండ్రీ, తాతలను పోగొట్టుకున్నాడు గోల్డీ. అమ్మ, అమ్మమ్మ, ముగ్గురు అక్కల మధ్య పెరిగాడు. అందుకే అతనికి స్త్రీ హృదయం ఏమిటో తెలుసు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటే ప్రేమకు ఓటమి లేదు. మా అబ్బాయి రణవీర్ ఇప్పుడిప్పుడే న్యూస్‌పేపర్లు చదవడం మొదలుపెట్టాడు. వాడికి రకరకాల సందేహాలు వస్తుంటాయి...నేను, గోల్డీ వాటికి విసుక్కోకుండా సమాధానాలు చెబుతుంటాం. పిల్లల జీవితంలో మొదటి ఏడు ఏళ్లు ముఖ్యమైనవని ఎక్కడో చదివాను. అందుకే మా అబ్బాయి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను.
 పిల్లల పెంపకంలో మా అమ్మను మించిన ఆదర్శం నాకు ఎవరూ లేరు.‘‘అందుకే ఎప్పుడూ అంటుంటాను... మా అమ్మే నా హీరో’’ అని.
 - సోనాలీ బెంద్రే
 

మరిన్ని వార్తలు