దీపావళికి డ్రై ఫ్రూట్స్‌ని గిఫ్ట్‌గా ఇస్తున్నారా? అలాంటప్పుడూ..

9 Nov, 2023 09:53 IST|Sakshi

ఇటీవల కాలంలో ఇతరులకు గిఫ్ట్‌ ఇవ్వడంలో ట్రెండ్‌ మారిం‍దనే చెప్పాలి. చాలా విభిన్నంగా ఇవ్వాలనే చూస్తున్నారు. అందులోనూ ఆరోగ్య దృష్ట్యా మంచివి ఖరీదైన వాటిని ఇచ్చేందుకు చూస్తుంటారు కొందరూ. ఇటీవల పండుగకి స్వీట్స్‌ బదులు ఆరోగ్యానికి ఎంతో మంచివైన డ్రై ఫ్రూట్స్‌ వంటివి గిఫ్ట్‌గా ఇచ్చే ట్రెండ్‌ బాగా వచ్చింది.  ఈసారి దీపావళి పండుగకి డ్రై ఫ్రూట్స్‌ని గిఫ్ట్‌గా ఇ‍వ్వాలనుకుంటే కచ్చితంగా ఇవి గుర్తుంచుకోండి.

డ్రైఫ్రూట్స్‌ను కొనేటప్పుడు కచ్చితంగా ఇవి గమనించాలి..

  • నట్స్‌ రంగు ఎలా ఉందో చూడాలి. సహజంగా ఉండాల్సిన దానికంటే మరింత ముదురు రంగులో ఉంటే అవి పాడైనట్టు. రుచిగా కూడా ఉండవు కాబట్టి కొనకపోవడమే మంచిది. వీలైతే ఒకటి రెండు నట్స్‌ను నీటిలో వేసి, పదినిమిషాల తరువాత కొరికి చూడాలి. నానిన తరువాత కూడా గట్టిగా ఉంటే అవి చాలా పాతవి.
  • ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి తీసుకోకూడదు. చాలా షాపులు తినడానికి శాంపిల్స్‌ ఇవ్వవు. ఇలాంటప్పుడు ఆ డ్రైఫ్రూట్స్‌ను తక్కువ పరిమాణంలో కొనుక్కుని పరిశీలించాలి
  • నట్స్‌ని వాసన చూడాలి. ఘాటైన వాసన వస్తే అవి చాలా పాతవి. వీటికి కొద్దిగా తేమ తగిలితే వెంటనే బూజు పట్టి త్వరగా పాడవుతాయి. ఇవి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు నట్స్‌ ప్యాకెట్‌ మీద ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ముద్ర, నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో చూడాలి. ఎప్పుడు ప్యాకింగ్‌ అయ్యింది? ఎప్పటిలోగా తినాలో సూచించే డేట్స్‌ను సరిగా చూసుకోవాలి. ఈ డేట్స్‌ ముద్రించని ప్యాకెట్స్‌ను కొనకూడదు
  • ప్యాకెట్‌ మీద ముద్రించిన సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలి. ప్రిజర్వేటివ్‌లు కలిపిన నట్స్‌ను కొనకపోవడమే మంచిది. 

(చదవండి: ఆపరేషన్‌ బ్యూటీ! అందం కోసం తీసుకునే ఇంజక్షన్‌లు మంచివేనా!)

మరిన్ని వార్తలు