రన్నింగ్‌ చేసే గృహిణుల కథ

16 May, 2018 00:06 IST|Sakshi

టైమ్‌ లెస్‌

జపాన్‌ నవలా రచయిత హరుకి మురకమి తనకున్న పరుగుల మోహం గురించి ఓ చోట ఇలా రాస్తాడు. ‘రన్నింగ్‌ అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. ఆ సమయంలో నేను ఎవ్వరితో మాట్లాడనవసరం లేదు. ఎవరినీ విననవసరం లేదు. రన్నింగ్‌ నా నిత్య జీవితంలోని ఒక ముఖ్యమైన భాగం’ అంటాడు. భారతీయ గృహిణలు కూడా చాలామంది హరుకి మురకమిలా రన్నింగ్‌ని ఇష్టపడతారు. ఇదే థీమ్‌తో బెంగళూరుకు చెందిన బృందా సమర్‌నాథ్‌ అనే ఫిల్మ్‌మేకర్‌ ‘టైమ్‌లెస్‌’ అనే డాక్యుమెంటరీ తీశారు. అందుకోసం దేశంలోని నాలుగు మెట్రో నగరాలలో రన్నింగ్‌ని తమకు ప్రియమైన వ్యాపకంగా ఏళ్లుగా కొనసాగిస్తున్న కొందరు గృహిణుల జీవితంలోని ఘటనలను కథగా మలుచుకున్నారు.

ఒక గంట నిడివిగల ఈ డాక్యుమెంటరీ ఈ నెలలో జరిగిన న్యూయార్క్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు వెళ్లొచ్చింది. వచ్చే నెల జరుగుతున్న అట్టావా ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో కూడా స్క్రీన్‌ అవబోతోంది. ఇందులో.. పనమ్మాయిగా ఉండి, ప్రొఫెషనల్‌ రన్నర్‌గా మారిన సీమా వర్మ ఎపిసోడ్‌ (ముంబై) ఎంతో ఉద్వేగభరితంగా ఉంటుంది. రన్నింగ్‌.. మహిళను కదలించే ధ్యానం అని చెబుతూ.. ప్రతి మహిళకూ రన్నింగ్‌ అవసరం అని, అది వాళ్లకు ఆరోగ్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెప్పే ఉద్దేశంతో బృందా ఈ డాక్యుమెంటరీని తీశారు.  

మరిన్ని వార్తలు