కళాకారుడు?

22 Jun, 2020 03:43 IST|Sakshi

సాహిత్య మరమరాలు

నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడెమీ సభ్యుడు, నాటక కళాప్రపూర్ణ, పౌరాణిక నాటక దిగ్గజం అయిన పీసపాటి నరసింహమూర్తికి శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో 1984లో భారీ పౌర సన్మానం జరిగింది. పౌరాణిక నటీ నటులతో, నాటకాభిమానులతో ఆ సభ కళకళలాడింది. సన్మాన సంఘం పక్షాన నిర్వాహక ప్రతినిధి ‘‘ప్రఖ్యాత కళాకారులు పీసపాటి గారికి పాదాభివందనం’’ అంటూ స్వాగతోపన్యాసం ప్రారంభించారు.

అయితే అభినవ శ్రీకృష్ణ పీసపాటి తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ– ‘‘కళాకారుణ్ణి కాదండి మహాప్రభూ! కళారాధకుణ్ణి మాత్రమే. కళయే ఆకారంగా కలిగినవాడు పరమేశ్వరుడైన నటరాజు మాత్రమే. అనంత భూమండలంలో ఆయా కళారూపాలను ప్రదర్శించే వారంతా కళారాధకులే తప్ప కళాకారాలు కారు’’ అన్నారు. దాంతో సభ కరతాళ ధ్వనులతో మార్మోగింది. - వాండ్రంగి కొండలరావు

మరిన్ని వార్తలు