ఒకే చోట రెండు పక్షులు 

25 Nov, 2019 01:42 IST|Sakshi

కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్‌ ఆధ్వర్యంలో 1950 ప్రాంతంలో అప్పటి ప్రముఖ కవులతో ఒక కవి సమ్మేళనం జరిగింది. అందులో గుర్రం జాషువా, దువ్వూరి రామిరెడ్డి, విశ్వనాథ సత్యనారాయణ వంటివారు పాల్గొన్నారు. కవిసమ్రాట్‌ విశ్వనాథకంటే ముందుగా సభా ప్రాంగణానికి వచ్చిన జాషువా, దువ్వూరి ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడే వచ్చిన విశ్వనాథ వ్యంగ్యంగా రెండు పక్షులూ ఒకచోట చేరాయే అన్నారు. ఇద్దరూ కవికోకిల బిరుదాంకితులే కదా. వెంటనే వారు స్పందిస్తూ ఈ కిరాతుడి కంట పడతామని అనుకోలేదన్నారు. ఆ ప్రాంగణంలో ఉన్నవారంతా వారి సమయస్ఫూర్తికి నవ్వుకున్నారు.
-డాక్టర్‌ పి.వి.సుబ్బారావు 

మరిన్ని వార్తలు