కొద్దిసేపు తొడగడానికే స్లిప్పర్లు!

19 Jul, 2017 22:58 IST|Sakshi
కొద్దిసేపు తొడగడానికే స్లిప్పర్లు!

పరిపరిశోధన

టకామని కాళ్లు దూర్చి... వెంటనే విడిచేయడానికి వీలుంటాయి కాబట్టి స్లిప్పర్లను కొందరు అదేపనిగా వాడుతుంటారు. ఇక కొన్ని దేశాల్లోని పేదవర్గాలకు చెందిన నిత్యం స్లిప్పర్లనే పాదరక్షలుగా వాడుతుంటారు. అలా చేయడం సరికాదని  హెచ్చరిస్తున్నారు నార్త్‌ కరోలినాలోని వేక్‌ ఫారెస్ట్‌ బాప్టిస్ట్‌ మెడికల్‌ సెంటర్‌కు చెందిన ప్రముఖ పోడియాట్రిస్ట్‌ (పాదాల నిపుణులు), ఫుట్‌ అండ్‌ యాంకిల్‌ సర్జన్‌ డాక్టర్‌ క్రిస్టియానా లాంగ్‌.

స్లిప్పర్లు కేవలం కొద్దిసేపు ఇంట్లో తొడగడానికి మాత్రమే అంటూ దీర్ఘకాలం పాటు కేవలం స్లిప్పర్లనే వాడేవారిలో అవి టపాటపామంటూ అదేపనిగా మడమకు తగులుతూ ఉండటం వల్ల మడమ ఎముక దెబ్బతినడంతో పాటు ‘అచిలిస్‌ టెండన్‌’ అనే టెండన్లకు సంబంధించిన సమస్యలు, నడుము నొప్పి వంటి అనర్థాలు కనిపించవచ్చని చెబుతున్నారు డాక్టర్‌ క్రిస్టియానా. ‘‘పైగా స్లిప్పర్లు ఫ్లాట్‌గా ఉండటం వల్ల పాదంలోని ఒంపు తిరిగి ఉండే చోట తగిన సపోర్ట్‌ ఇవ్వవు. దాంతోకూడా కొన్ని సమస్యలు వస్తాయి. అందుకే వాటిని కేవలం ఇంట్లో మాత్రమే కొద్దిసేపు వాడాలి’’ అంటూ ఆమె వివరిస్తున్నారు.

మరిన్ని వార్తలు