బ్రిటన్‌లో ‘చిల్లర’ గొడవ

14 Oct, 2015 00:11 IST|Sakshi
బ్రిటన్‌లో ‘చిల్లర’ గొడవ

ఆ నేడు 14 అక్టోబర్ 1969

విలువను బట్టి కరెన్సీ నాణేల రూపాలు, ఆకృతులు వేర్వేరుగా ఉండాలి. అప్పుడే వాటిలోని వ్యత్యాసాలను తేలిగ్గా కనిపెట్టగలం. లావాదేవీలను వేగంగా చేయగలం. కానీ ఎందుకనో ప్రభుత్వాలు కొన్నిసార్లు ఈ విషయాన్ని గమనించినట్టు కనిపించవు! అందుకు నిదర్శనమే మనం ఇప్పుడు రూపాయి, రెండు రూపాయల నాణేలతో పడుతున్న ‘చిల్లర’ గొడవ. సాధారణంగా చిల్లర గొడవ అంటే చిల్లర లేక పడే గొడవ. కానీ ఇప్పుడు చిల్లర ఉండీ గొడవ పడుతుండడం మన దగ్గర మూమూలయింది.

భారత ప్రభుత్వం ఒక రూపాయి, రెండు రూపాయల నాణేల మధ్య వాటి వాటి రూపాలలో, సైజులలో పాటించవలసినంత వ్యత్యాసాన్ని పాటించకుండా ముద్రించడంతో.. సిటీ బస్సులలో, మార్కెట్‌లో అయోమయం ఎక్కువైంది. నాణేలను ఇచ్చిపుచ్చుకోవడంలో జాప్యం జరుగుతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే 1969తో బ్రిటన్‌లో తలెత్తింది. ఆ ఏడాది అక్టోబర్ 14న ఏడు భుజాలతో ఇంగ్లండ్ ప్రభుత్వం విడుదల చేసిన 50 పెన్నీల నాణెం... అప్పటికే చెలామణిలో ఉన్న పది పెన్నీల నాణేన్ని పోలి ఉండడంతో జనంలో మొదటిరోజే తికమక మొదలైంది. ఆ తర్వాత కొద్ది కాలానికే బ్రిటన్ ఆ పొరపాటును దిద్దుకుని కొత్త నాణేన్ని విడుదల చేసింది. మన దగ్గర అలాంటి దిద్దుబాట్లు జరిగితే బాగుంటుంది.
 

మరిన్ని వార్తలు