మహా మీసం

2 Mar, 2016 23:19 IST|Sakshi
మహా మీసం

తిక్క  లెక్క

ఫొటోలో కనిపిస్తున్న ఈ జర్మన్ మీసగాడి పేరు కార్ల్ హీన్జ్ హిల్లే. మూతిమీద మీసం మొలిచినప్పటి నుంచి మీసం మీద తెగ మక్కువ పెంచుకున్నాడు. అక్కడితో ఆగకుండా, ఏపుగా పెంచి, నిమ్మకాయలు నిలబెట్టే స్థాయిలో మెలితిప్పి, చక్కగా తీర్చిదిద్దుకోవడం మొదలుపెట్టాడు.

ప్రపంచంలో ఎక్కడ మీసాలు గడ్డాల పోటీలు జరిగినా ఠంచనుగా హాజరయ్యేవాడు. ఈ మీసగాడి శ్రమ వృథా పోలేదు. 1999-2011 వరకు జరిగిన ప్రపంచస్థాయి మీసాలు, గడ్డాల పోటీల్లో ప్రతిఏటా విజేతగా నిలిచి బహుమతులు సాధించాడు. వాటితో పాటు అదనంగా మీసాలు, గడ్డాల పోటీల్లో అత్యధిక బహుమతులు సాధించినందుకు గిన్నెస్ రికార్డునూ దక్కించుకున్నాడు.



 

మరిన్ని వార్తలు