ఆమె తెలివి... ముగ్గురికి ప్రాణం పోసింది

22 Jun, 2014 23:51 IST|Sakshi
ఆమె తెలివి... ముగ్గురికి ప్రాణం పోసింది

 విజయం
 
మామూలప్పుడు ఎవరైనా తెలివితేటలు చూపిస్తారు. కానీ ప్రమాదంలో పడినప్పుడు కంగారు పడకుండా, తెలివిగా ఆలోచించి బయట పడటంలోనే అసలు తెలివితేటలు కనిపిస్తాయి. ఈ ఫొటోలో ఉన్న చిట్టితల్లి అలా తెలివిగా ఆలోచించి ముగ్గురి ప్రాణాలను కాపాడింది. పదేళ్ల ఈ చిన్నారి పేరు బ్రియానా వ్యాన్‌‌స. తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో నివసిస్తోంది. ఇటీవల అక్కడ పెద్ద తుఫాను వచ్చింది.

భయంకరంగా వచ్చిన ఈదురు గాలులకు చాలా ఇళ్లు కుప్పకూలాయి. చెట్లు నేల రాలాయి. బ్రియాన్ ఇంటిముందు ఉన్న పెద్ద చెట్టు కూడా కూలిపోయింది. అది సరిగ్గా బ్రియాన్ తండ్రి గ్రెగరీ మీద కూలడంతో అతడు దాని కింద ఇరుక్కుపోయాడు. ఓ పక్క విపరీతమైన గాలి. మరో పక్క వరద నీరు. పైగా ఒళ్లంతా గాయాలు. దాంతో బయటకు రాలేకపోయాడు. కాసేపుంటే చనిపోయేవాడే. అప్పుడే బ్రియాన్ తండ్రిని చూసింది. అతడి పరిస్థితి అర్థమైంది.

తన చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌లో ఫేస్‌బుక్ ఓపెన్ చేసి... ‘మా నాన్న చనిపోయేలా ఉన్నాడు, కాపాడండి’ అంటూ పోస్ట్ చేసి, తన అడ్రస్ పెట్టింది. కొద్ది క్షణాల్లోనే దాన్ని చాలామంది చూశారు. పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు అంబులెన్సును తీసుకుని వచ్చి గ్రెగరీతో పాటు, ఆ చెట్టు కింద ఇరుక్కున్న మరో ముగ్గురి ప్రాణాలను కూడా కాపాడారు. రియల్ హీరో అంటూ బ్రియాన్‌ని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ దెబ్బతో బ్రియాన్ వర్జీనియాలో పెద్ద సెలెబ్రిటీ అయిపోయింది!
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా