థగ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌

3 Dec, 2017 00:43 IST|Sakshi

తాప్సీ పన్ను, జాక్వెలిన్‌ ఫర్నాండెజ్‌ జుట్టు పీక్కుని కొట్టుకున్నారట. ఇలియానా, ఈషా గుప్తా వెంట్రుకవాసిలో కత్తులు దూసుకున్నారట. బాలీవుడ్‌ రూమర్లు నమ్మితే సినిమాలో కథల కంటే డ్రమాటిక్‌గా ఉంటాయి. జుట్లు పీక్కున్నారో బాకులు దూసుకున్నారో అపన్‌కో నై మాలూమ్‌... అంటే మనకి తెలియదు. ఇప్పుడీ లిస్ట్‌లో ఇంకో ఇద్దరు డ్రమాటిక్‌గా చేరారు. హీరోలు హీరోలు కలబడటం, హీరోలు హీరోయిన్‌లు కలిసి విడిపోవడం, విడిపోయి కలవడం ఇలాంటి రూమర్ల టైమ్‌ అయిపోయింది.

ఇప్పుడంతా లేడీస్‌ టైమ్‌. ఈ ఇద్దరు లేడీస్‌ ఎవరు అని మీరు ముక్కున వేలేసుకోవద్దు. ఆమిర్‌ ఖాన్‌ తీస్తున్న ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌’ సినిమాలో కత్రీనా కైఫ్, ఫాతిమా సనా షేక్‌ ఇద్దరూ మంచి భూమికలు పోషిస్తున్నారు. కత్రీనా ఈ సినిమాలో గెటప్‌ గాఢమైన కళ్లు, అలల్లాంటి జుట్టు, సూపర్‌ సెక్సీ డ్రెస్సింగ్‌తో అలరించనుందని ఆల్రెడీ న్యూస్‌ అవుట్‌ అయ్యింది. మరి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఏమో ఆమిర్‌ ఖాన్‌ ఈ కథ ఫాతిమా చేస్తున్న పాత్ర చుట్టే తిరుగుతుందని చెప్పాడు.

నా చుట్టూ తిరిగే కథలో నాకు గాఢమైన కళ్లు, అలల్లాంటి జుట్టు, సూపర్‌ సెక్సీ డ్రస్సులుండాలి కానీ సపోర్టింగ్‌ రోల్‌లో ఉన్న కత్రీనాకి అవన్నీ ఉంటే ఎలా అని ఫాతిమా, నాలాంటి హీరోయిన్‌ను తీసుకుని ఫాతిమా మెయిన్‌ పాత్ర ఇవ్వడం ఏంటని కత్రీనా దొందూ దూసుకుంటున్నారు. దూషించుకుంటున్నారు. ఆమిర్‌ ఖాన్, అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్న ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌’ సినిమాలో వీళ్లిద్దరి కంటే వాళ్లిద్దరి గురించే ముచ్చట ఎక్కువగా ఉంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు