మృదువైన చేతుల కోసం...

17 Nov, 2018 01:19 IST|Sakshi

ఈ కాలం గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మం పొడిబారి గరుకుగా తయారవుతుంది. రకరకాల పనుల వల్ల చేతులు నీళ్లలో ఎక్కువసేపు ఉండటం వల్ల చేతులపై చర్మం మరింత పొడిబారి, గరుకుగా అవుతుంది. ఈ సమస్యకు విరుగుడుగా.. 

టేబుల్‌ స్పూన్‌ టమాటా రసంలో అర టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం, రెండు టేబుల్‌ స్పూన్ల గ్లిజరిన్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు చేతులకూ రాసి, అయిదు నిమిషాల పాటు మృదువుగా మర్దనా చేయాలి. టేబుల్‌ స్పూన్‌ శనగపిండిలో అర టేబుల్‌ స్పూన్‌ రోజ్‌వాటర్, చిటికెడు పసుపు కలిపి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు రాసి, ఆరిన తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.టేబుల్‌ స్పూన్‌ శనగపిండిలో గుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్‌ గంధం పొడి కలపాలి. ఈ పేస్ట్‌ని చేతులపై పట్టించి 20 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ కాలం ట్యాన్‌ సమస్య కూడా ఉంటుంది కాబట్టి మురికి తొలగించడానికి ఈప్యక్స్‌ బాగా పనిచేస్తాయి. వారంలో మూడు రోజులైనా ఈ ప్యాక్స్‌ వేసుకుంటే మేలు. అలాగే రాత్రి పడుకునేముందు చేతులకు గ్లిజరిన్‌ బేస్డ్‌ కోల్డ్‌ క్రీము తప్పనిసరిగా రాసుకోవాలి. గోళ్లను కూడా మర్దనా చేయాలి. దీని వల్ల చేతులపై చర్మం మృదువుగా అవుతుంది.

మరిన్ని వార్తలు