టాప్ క్లాస్

17 Nov, 2016 23:07 IST|Sakshi
టాప్ క్లాస్

లంగా మాస్.. కాదు క్లాస్..
కాదు ట్రెడిషనల్.. కాదు కంఫర్ట్...
మరి, మాస్.. క్లాస్.. ట్రెడిషనల్.. కంఫర్ట్‌ను  ట్రెండీ చేయడం ఎలా?
ఓసోస్.. దానికి అంత టెన్షనా?
టాప్ మారిస్తే పోలా!!
ఏమిటీ, లంగాకు ట్రెండ్ రావాలంటే టాప్ మార్చమంటావూ..!
అవునండీ.. అవును!
క్రాప్ టాప్ వేసి చూడండి.
స్మార్ట్ వాక్ చేసి చూడండి.

బంగారు రంగు జరీ పూలతో అలంకరించిన పొడవాటి లంగా మీదకు ప్లెయిన్ క్రాప్ టాప్ వేస్తే సంప్రదాయానికి స్టైలిష్ అట్రాక్షన్. ఇతర హంగులేవీ అవసరం లేని సిసలైన అలంకరణ.  చిన్న చిన్న ప్రింట్లు ఉన్న పలాజో స్కర్ట్‌కు అదే రంగు ప్రింటెడ్ క్రాప్ టాప్. క్యాజువల్ వేర్‌గా కనువిందు చేసే ప్రత్యేక ఆకర్షణ. వెస్ట్రన్ లాంగ్ మిడీకి స్లీవ్‌లెస్ క్రాప్‌టాప్ కరెక్ట్ ఎంపిక. కంఫర్ట్ కోసం నేటి తరం యువతులు ఎంచుకునే క్యాజువల్ వేర్‌గా ఎప్పుడూ ముందు వరసలో ఉంటుందీ డ్రెస్.

ప్లెయిన్ లంగా మీదకు అదే రంగు స్లీవ్‌లెస్ క్రాప్ టాప్ కట్‌తో లుక్ స్టైలిష్‌గా మారిపోయింది. క్రాప్ టాప్‌పైన ఎంబ్రాయిడరీ వర్క్ చేయడంతో సంప్రదాయపు కళ వచ్చేసింది.పొడవాటి చేతుల క్రాప్‌టాప్, జరీ జిలుగులతో ఎంబ్రాయిడరీ చేసిన అదే రంగు పొడవాటి లంగా.. వేడుకకు యువరాణి కళను మోసుకొస్తుంది.  ఈవెనింగ్ పార్టీలో వైవిధ్యంగా వెలిగిపోవాలంటే పొడవాటి లంగాకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేసిన క్రాప్‌టాప్ ఓ ఎంపిక. గులాబీ రంగు ప్రింటెడ్ లంగా మీదకు అదే రంగు ప్లెయిన్ క్రాప్‌టాప్ ధరిస్తే, పార్టీలో కొత్త సందడి మొదలైనట్టే.

కనెక్ట్ట్ క్రాప్ టాప్
క్రాప్ టాప్ రెట్రో కాలానికి చెందినది. పాశ్చాత్యులు విరివిగా వాడే ఈ టాప్ ఇప్పుడు మన సంప్రదాయ లంగాల మీదకు ఒద్దికగా చేరింది. స్టైలిష్‌గా మారింది. పొడవు లంగా మీదకు పొట్టి జాకెట్టుగా వేడుకలలో హైలైట్‌గా నిలిచింది. నేటి తరానికి అమితంగా కనెక్ట్ అయిన ఈ క్రాప్‌టాప్ ధరించినప్పుడు స్లిమ్‌గా కనిపించాలంటే కొన్ని టెక్నిక్స్ తప్పనిసరి.

లంగా లేదా మిడ్డీ కలర్, ప్రింట్లు, కుచ్చులు ఎక్కువగా ఉంటే టాప్ ప్లెయిన్‌గా, సింపుల్‌గా ఉండాలి  లాంగ్ స్లీవ్స్ ఇష్టపడేవారు టాప్ సైజ్ తక్కువ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి  బిగుతైనది వేసుకుంటే కంఫర్ట్ లేదనుకునేవారు లూజ్ క్రాప్‌టాప్‌నూ ఎంచుకోవచ్చు. అయితే, చూడడానికి ఎబ్బెట్టుగా కాకుండా కటింగ్, ఫిటింగ్ కరెక్ట్‌గా ఉండాలి  ఒకే రంగు లంగా, క్రాప్ టాప్ ఎంచుకునేటప్పుడు ఎంబ్రాయిడరీ చేయించుకుంటే సంప్రదాయ వేడుకలకు బాగుంటుంది  పలాజో స్కర్ట్ వేసుకున్నప్పుడు క్రాప్‌టాప్ ధరిస్తే, చలికాలానికి తగ్గట్టు పైన బ్లేజర్ ధరించవచ్చు.

మరిన్ని వార్తలు