పెరుగుతో బీపీకి చెక్

4 Mar, 2016 23:05 IST|Sakshi
పెరుగుతో బీపీకి చెక్

పరిపరి  శోధన

పెరుగులోని మేలు చేసే బ్యాక్టీరియా పేగులకు రక్షణగా నిలుస్తుందని, పెరుగులోని కాల్షియం ఎముకలకు పటుత్వాన్ని ఇస్తుందని... ఇలా పెరుగు వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే, తరచుగా పెరుగు తీసుకుంటూ ఉంటే, రక్తపోటు కూడా అదుపులోకి వస్తుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.

వారానికి కనీసం ఐదుసార్లు పెరుగు తీసుకున్నట్లయితే, రక్తపోటు గణనీయంగా అదుపులోకి వస్తుందని బోస్టన్ వర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. దాదాపు 2.40 లక్షల మందిపై విస్తృతంగా నిర్వహించిన పరిశోధనల ద్వారా ఈ మేరకు నిర్ధారణకు వచ్చినట్లు బోస్టన్ పరిశోధకులు చెబుతున్నారు.
 

 

మరిన్ని వార్తలు