ఈ వారం యూట్యుబ్ హిట్స్

14 Dec, 2015 00:45 IST|Sakshi
ఈ వారం యూట్యుబ్ హిట్స్

ఎక్స్-మెన్ : అపోకలిప్స్ ట్రైలర్
నిడివి : 2 ని. 33 సె.
హిట్స్ : 1,12,44,646

గ్లోబల్ స్మాష్ హిట్ ‘ఎక్స్-మెన్: డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్’ (2014) తర్వాత బ్రియాన్ సింగర్ డెరైక్షన్‌లో వస్తున్న మరొక విధ్వంసకర చిత్రం ‘ఎక్స్-మెన్ అపోకలిప్స్’. మార్వెల్ కామిక్స్‌లో కనిపించే ఎక్స్-మెన్ పాత్రల ఆధారంగా తయారైన ఈ అమెరికన్ సూపర్ హీరో ఫిల్మ్ వచ్చే ఏడాది మార్చి 27 విడుదల అవుతోంది. వెయ్యేళ్ల నిద్ర తర్వాత మేల్కొన్న ఒక మహా శక్తి మానవాళిని తుడిచిపెట్టి, సరికొత్త ప్రపంచాన్ని నిర్మించి, దానిని ఏలడం కోసం విధ్వంసం సృష్టిస్తుంది. ప్రొఫెసర్ ఎక్స్, కొంతమంది ఎనర్జిటిక్ ఎక్స్-మెన్ ఆ శక్తిపై పోరాడుతుంటారు. ట్రైలర్‌కు హిట్‌ల మీద హిట్‌లు వచ్చిపడుతున్నాయి.
 
గో టు కాలేజ్ మ్యూజిక్ వీడియో
నిడివి : 2 ని. 2 సె.
హిట్స్ : 31,07,805

ఈ వీడియో ఓసమ్ అబ్బా! మిషెల్ ఒబామా స్టెప్స్ చూడాల్సిందే. అమెరికన్ యాక్టర్, స్టాండప్ కమెడియన్ అయిన 28 ఏళ్ల జే ఫారోతో కలిసి ఎండింగ్‌లో మిషెల్ చేసిన సింపుల్ డాన్స్ ఎంతో స్టెయిలిష్‌గా ఉంది. కాలేజ్ లైఫ్ ఎంత బాగుంటుందో మిషెల్ ఇందులో చెబుతారు. గ్రాడ్యుయేట్‌గా ఆమె ఫోటోలు, అమెరికన్ ఫస్ట్ లేడీగా ఆమె మెమరీస్ మధ్య మధ్య మెస్మరైజ్ చేసి వెళుతుంటాయి. ‘కాలేజ్ లైఫ్ ఒక సెలబ్రేషన్‌లా ఉండాలి. యువతరం కలలకు కాలేజ్‌లోనే పునాది పడుతుంది కాబట్టి’ అని అర్థం వచ్చేలా సాగే ఈ వీడియో ఫన్‌గా, ఫ్రెష్‌గా ఉంది.
 
 
టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టిల్స్ 2 : ట్రైలర్
నిడివి : 2 ని. 25 సె.
హిట్స్ : 1,03,56,938

ఇదే టైటిల్‌తో గత ఏడాది వచ్చిన చిత్రానికి పార్ట్ 2 ఇది. దీనికి ‘ఔట్ ఆఫ్ ది షాడోస్’ అని పేరు పెట్టారు. డేవ్ గ్రీన్ దర్శకత్వంలో తయారవుతున్న ఈ త్రీడీ సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ వచ్చే ఏడాది జూన్ 3న విడుదల అవుతోంది. ఇందులో మానవ రూపం కలిగిన నాలుగు తాబేళ్లు ఉంటాయి. అవే ఈ కథలోని హీరోలు. ఇది కూడా ఇంచుమించు ఎక్స్-మెన్ కథాంశంతోనే ఉంటుంది. అలాగని కొత్తదనం ఉండదని కాదు. నవ్వు తెప్పించే టీనేజ్ కుర్రకుంకల వెర్రిమొర్రి వేషాలను బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు. ట్రైలర్ మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది. వెరీ ఫన్నీ, వెరీ మచ్ థ్రిల్లింగ్.
 
డంబెస్ట్ కిచెన్ గ్యాడ్జెట్స్
నిడివి : 5 ని. 38 సె.
హిట్స్ : 28,93,592

ఆల్టన్ బ్రౌన్ సెలబ్రిటీ చెఫ్. యూనిటాస్కర్స్ అంటే ఆయనకు చికాకు. ఒక గాడ్జెట్‌తో ఒకే పని చేయాలి. అనేక పనులు చేసే ఒకే గ్యాడ్జెట్ అంటే ఆయనకు సదభిప్రాయం లేదు. కానీ అమెజాన్ వారు తయారు చేసిన ‘డంబెస్ట్ కిచెన్ గ్యాడ్జెట్స్’ ఆయనకు నచ్చినట్లే కనిపిస్తోంది! అందుకే వాటిపై రివ్యూ ఇచ్చారు. ఆ రివ్యూనీ ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు కూడా. ఎందుకంటే... బ్రౌన్ డి స్‌ప్లే ఇస్తున్నప్పుడు స్క్రీన్‌పైకి అమెజాన్ వారి పాప్ అప్స్ వచ్చేసి, గాడ్జెట్స్ కొనుగోలు వివరాలను అందిస్తాయి. కిచెన్‌పై ప్రేమ ఉన్నవారు కొనకుండా ఉండలేని గాడ్జెట్సే ఇవన్నీ!
 

హ్యాండ్స్ టు మైసెల్ఫ్ / మి అండ్ మై గర్ల్స్
నిడివి : 4 ని. 42 సె.
హిట్స్ : 25,94,098

 స్త్రీల లో-దుస్తుల డిజైనింగ్‌లో విశ్వవిఖ్యాతి గాంచిన ‘విక్టోరియాస్ సీక్రెట్’ 2015 ఫ్యాష్ షో వేదికపై అమెరికా సింగర్, యాక్ట్రెస్, ఫ్యాషన్ డిజైనర్ సెలీనా గోమజ్ ఆలపించిన అందమైన గీతం ఇది. కొత్త కొత్త డిజైన్‌లతో రూపొందిన దుస్తులను ధరించి అమ్మాయిలు ర్యాంప్‌పై నడుస్తుంటే.. ఆ లయకు బుద్ధురాలైన సెలీనా తన గాత్రంతో వారి నడకలకు మరింత ఆధునికతను తెచ్చి పెట్టారు. ‘హ్యాండ్స్ టు మీ అండ్ మై గర్ల్స్’ అని సెలీనా  తీసే రాగం మహిళా సాధికారతకు సిగ్నేచర్ ట్యూట్‌లా వినిపిస్తుంది. గాళ్స్.. ఈ వీడియోను మీరు తప్పక చూడాలి.
 
హాత్ మూ ఔర్ బమ్, బిమారీ హోగీ హమ్
నిడివి : 2 ని. 18 సె.
హిట్స్ : 48,02,986

హాత్ అంటే చెయ్యి. మూ అంటే నోరు, బమ్ అంటే బాటమ్. వీటితో చేసే పనుల్లో శుభ్రతను పాటిస్తే ఆరోగ్యం శుభ్రంగా ఉంటుందన్న సందేశంతో హిందూస్థాన్ లీవర్ కంపెనీ రూపొందించిన వీడియో ఇది. చిన్నపిల్లలు తమ ముద్దు ముద్దు మాటలతో, పాటలతో, అల్లరితో పెద్దవాళ్లకు ‘‘తెలిసి వచ్చేలా’ చేయడం ఇందులోని థీమ్. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, శుభ్రమైన నీటినే తాగాలి, శుభ్రమైన టాయ్‌లెట్‌లను ఉపయోగించాలి అని పిల్లలు చెప్పే విధానం బాగుంటుంది. వాణిజ్య ప్రకటనల తీరు మరింత సున్నితంగా మారిందనడానికి ఈ వీడి యో తాజా ఉదాహరణ.
 

మరిన్ని వార్తలు