రూపాయి డాక్టర్...

2 Sep, 2016 17:29 IST|Sakshi

వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాల్లోకి రాకముందు ఒక్క రూపాయి డాక్టరుగా పేరు పొందారు. పులివె ందుల నడిబొడ్డున ఇప్పుడు ఉన్న వైఎస్ రాజారెడ్డి వైద్యశాలను 1974లో వైఎస్‌ఆర్ తండ్రి వైఎస్ రాజారెడ్డి ఏర్పాటు చేశారు. ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు ఎల్లవేళలా వైద్యులు అందుబాటులో ఉండేలా చూశారు.
* అప్పట్లో వైఎస్‌ఆర్ డాక్టరుగా జమ్మలమడుగు గ్రాంబెల్ ఆసుపత్రిలో పనిచేస్తూ ఉండేవారు. అనంతరం పులివెందుల ప్రజావైద్యశాలలో డాక్టరుగా పనిచేశారు. ప్రజలతో మమేకమై, వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొంటూ వైద్యసేవలు అందించారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించేవారు. ఇతరులకు నామమాత్రంగా రూ.1 ఫీజు ఉండేది. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి 1978లో ప్రజాసేవకోసం రాజకీయ ప్రవేశం చేశారు. ఆసుపత్రిలో వైద్యుల సంఖ్యను పెంచి తన చిన్నాన్న, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పురుషోత్తమరెడ్డిని ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా నియమించి ఆసుపత్రి బాధ్యతలు అప్పగించారు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ ప్రజా వైద్యశాల అతి తక్కువ ఫీజులతో నడుస్తూ ఎన్నో అవార్డులు అందుకుంది.
* ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు, కాన్పులు, జనరల్ వైద్యసేవలు... ఇలా అన్ని సదుపాయాలు ఉండేలా చేయడంలో వై.ఎస్. కృషి ఎంతో ఉంది.



మరిన్ని వార్తలు