ఐటీ ఉద్యోగులు.. సీఈఓ సైకిల్ రైడ్

20 Jul, 2014 03:51 IST|Sakshi
ఐటీ ఉద్యోగులు.. సీఈఓ సైకిల్ రైడ్

హైదరాబాద్ నగరాన్ని పొల్యూషన్ ఫ్రీగా మార్చడానికి చేస్తున్న కృషిలో ఐటీ ఎంప్లాయిస్‌ది కీ రోల్. భాగ్యనగరంలో కాలుష్యం తగ్గించేందుకు అనేక మంది ఐటీ ఉద్యోగులు నిత్యం ఆఫీసులకు సైకిల్‌పై వెళుతున్నారు. ఈ స్ఫూర్తిని మరింత పెంచేందుకు ‘ీసీఈఓ రైడ్’ పేరుతో ఐటీ కంపెనీల సీఈఓలు శనివారం సైబరాబాద్ మైండ్ స్పేస్‌లో సైకిల్ రైడ్ నిర్వహించారు.
 
దాదాపు 250 మందికి పైగా సాఫ్ట్‌వేర్ సంస్థల సీఈఓలు రైడ్‌లో పాల్గొన్నారు. తెలంగాణ ఐటీ మంత్రి కెటీఆర్ రైడ్ ప్రారంభించారు. మైండ్‌స్పేస్ ఐటీ పార్కులో వెస్టిన్ హోటల్ నుంచి ప్రారంభమై తిరిగి అదే హోటల్ వద్ద ఈ ర్యాలీ వుుగిసింది. టీఎస్‌ఐఐ వైస్‌చైర్మన్, ఎండీ జయేష్ రంజన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ అనంద్, ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి, కాగ్నిజెంట్ సీఈఓ లక్ష్మీ నారాయణ్, మైమాప్ జీనో సీఈఓ అను ఆచార్య, హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, వెల్‌ఫర్‌గో ఎండీ అనీగ్ ముఖర్జీ, ఏడీపీ సీఈఓ శక్తి సాగర్ రైడ్‌లో పాల్గొన్నారు.       
 
 ట్రాక్ పెంచుతాం: కేటీఆర్
 -    హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మారుస్తాం
 -    ఏడాదిలో 52 సార్లు ఇలాంటి రైడ్లు నిర్వహించాలి
 -    ఆగస్టులో స్టార్టప్ ఫెస్ట్. ఇందులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు 1500 వుంది పాల్గొంటారు
 -    బెంగళూరులో 21 బిలియున్ల ఎక్స్‌పోర్ట్స్ జరుగుతున్నారుు. కానీ నగరం నుంచి ఈ సంఖ్య 8 బిలియున్లు వూత్రమే. ఇందుకు వాతావరణం, రాయితీలు, స్థలాలు, నిష్ణాతులైన ఐటీ
 ఉద్యోగులు కొరత వంటివి కారణాలు. వీటిని అధిగమిస్తాం.
 -    ఐటీతో పాటు వ్యూనుఫ్యాక్చరింగ్ సెంటర్లనూ అభివృద్ధి చేస్తాం
 -    నగరంలో 2 లక్షల వుంది ఐటీ ఉద్యోగులున్నారు. వారి కోసం ప్రస్తుతవుున్న 30 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్‌ను 80 కిలో మీటర్లకు విస్తరిస్తాం.
 - సాక్షి, సిటీ ప్లస్

మరిన్ని వార్తలు