రిటైర్డు ఉద్యోగులపై తెలంగాణ ప్రభుత్వ అలక్ష్యం

10 Apr, 2015 02:10 IST|Sakshi
కె.చంద్రప్రకాష్‌రావు

సందర్భం

 తొమ్మిది మాసాల కిందట ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ప్రచారంలోకి వచ్చింది. ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం స్నేహపూర్వక వైఖరిని ప్రదర్శిస్తుందని సీఎం కేసీఆర్ పలు సంద ర్భాలలో ప్రకటించారు. అయితే, అనేక ఏళ్ల శ్రమ, సేవ అనంతరం పదవీ విరమణ చేసిన తెలంగాణ రాష్ట్రంలోని రెండున్నర లక్షల మంది రిటైర్డ్ ఉద్యో గుల పట్ల మాత్రం కనీస సానుభూతి ప్రదర్శితం కాకపోవడం శోచనీయం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి రిటైరయ్యే మాసం వేతనంలో సగభాగాన్ని పెన్షన్‌గా నిర్ధారించాలని నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1998 మే నెల 25వ తేదీన ఒక జీఓను (జీఓఎంఎస్ నం. 87) జారీ చేసింది. 1998 మే నెల 25వ తేదీకి ముం దు రిటైరైన వారికి కూడా ఈ జీవో వర్తింపచేసి పెన్షన్ నిర్ధారించాలని రిటైర్డ్ ఉద్యోగులు 1998 నవంబర్ 11వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశా రు. ఈ విజ్ఞప్తిని నాటి రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరిం చింది. దీంతో రిటైర్డు ఉద్యోగుల సంఘం ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో అప్పీలు చేసింది. ఈ అప్పీలును అంగీకరిస్తూ, సమర్థిస్తూ ట్రిబ్యునల్ 2002 జనవరి 3వ తేదీన తీర్పు ఇచ్చిం ది. ట్రిబ్యునల్ తీర్పునకు వ్యతిరేకంగా నాటి ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేసింది. ఈ అప్పీ లును హైకోర్టు కొట్టివేసింది. 1998 మే నెల 25 నాటి జీఓ 87ను ఆ రోజు వరకు జీవించి ఉన్న రిటై ర్డు ఉద్యోగులందరికీ లేక వారి కుటుంబాల్లోని ఫ్యా మిలీ పెన్షనర్లకు 3 నెలల లోపున వర్తింపచేయాలని, సవరించిన వేతనాల బకాయిలను కూడా చెల్లించా లని ఏపీ హైకోర్టు 2003 డిసెంబర్ 23వ తేదీన స్పష్టమయిన తీర్పు ఇచ్చింది.

 ఈ తీర్పును కూడా సవాలు చేస్తూ నాటి ఏపీ ప్రభుత్వం 2004 మే 2వ తేదీన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. 2005 ఫిబ్ర వరిలో ఈ స్పెషల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభ మైంది. పదేళ్లపాటు విచారణ సాగి విపరీత జాప్యం తరువాత సుప్రీంకోర్టు 2014 ఏప్రిల్ 30వ తేదీన అవిభక్త ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నాటికి (2014 ఏప్రిల్ 30) ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ జరుగుతున్నది. అప్పుడు రాష్ట్రం లో గవర్నర్ పాలన నడుస్తున్నది. సుప్రీంకోర్టు తీర్పు ను వెంటనే అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘం 2014 మే నెలలో రాష్ట్ర గవర్నర్‌కు విజ్ఞప్తి పత్రాలను సమర్పిం చింది. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు పరచాలని అభ్యర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సం ఘం 2014 జూలై 8వ తేదీన కేసీఆర్‌కి ఒక విజ్ఞప్తి పత్రం సమర్పించింది. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయలేదని వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘం రాష్ట్ర హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిం ది. ఈ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు విచారణ ప్రారం భించకముందే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ను అమలు జరపడానికి 2014 డిసెంబర్ 15వ తేదీన జీఓను జారీ చేసింది.

 ఎంప్లాయీ ఫ్రెండ్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8 మాసాలైనప్పటికి సుప్రీంకోర్టు తీర్పు అమలుకు జీఓ జారీ చేయలేదు. 1998 మే 25వ తేదీ న 87 జీవో వెలువడే నాటికి తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఖ్య 58,140. తరు వాత 28 ఫిబ్రవరి 2014 నాటికి వీరిలో 28,517 మంది మృతిచెందారు. ఈరోజు వీరిలో జీవించి ఉన్నవారి సంఖ్య 30 వేలకు మించదు. తెలంగాణ రిటైర్డు ఉద్యోగులందరు మొదట విద్యార్థులుగా ఉన్నప్పుడు, తరవాత 1969-71 తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, ఆ తరువాత 2001 నుంచి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో చురుకుగా పాల్గొన్నారన్నది జగద్విదితం. తెలం గాణ ప్రభుత్వం ఇంతవరకు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయలేదు, సర్వీసు ఉద్యోగులకు ఇచ్చిన తెలంగాణ ఇంక్రిమెంట్‌ను రిటైర్డు ఉద్యోగులకు ఇవ్వలేదు. రెండున్నర లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వ అనాద రణ, అలక్ష్య ధోరణిపై రిటైర్డు ఉద్యోగులలో అసం తృప్తి తీవ్రమవుతున్నది.
 
 (వ్యాసకర్త అధ్యక్షులు  తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్)
  మొబైల్: 94414 55412

మరిన్ని వార్తలు