బిడ్డను భర్తే అపహరించాడు..!

28 Jul, 2019 08:58 IST|Sakshi

క్రైమ్‌ స్టోరీ

‘క్రికెట్‌ క్రీడకు సంబంధించి పందెం కాయడం చట్ట విరుద్ధం’ అని ముకుందరావుకు తెలిసిన సంగతే..! అయినప్పటికీ తన వ్యసనం మానుకోలేకపోతున్నాడు అతడు. ఈసారి ముకుందరావు వంటి బెట్టింగ్‌ రాయుళ్ల మీద పోలీసులు ఉక్కుపాదం మోపారు. ముకుందరావునూ, అతడితో పాటు మరో  నలుగురినీ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానంలో వాళ్లను ప్రవేశపెట్టారు. తదుపరి రిమాండ్‌ కు తరలించారు.
ఈ ఘట్టం చిన్న విషయం కాదు. యుద్ధ పిపాసి అయిన ఉత్తర కొరియా ‘కిమ్‌’ అనుచర వర్గంలోని ఒకడితో ముకుందరావు వ్యసనం ముడిపడిపోయింది.

సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ భారతి తన ప్రయోగశాల నుండి బయటికి వచ్చింది. సెక్యూరిటీ గార్డుల పలకరింపులు వింటూనే వారికి తగిన రీతిలో స్పందిస్తోంది భారతి. పార్కింగ్‌ స్థలంలోని తన కారును నడుపుతూ ఆమె బయలుదేరింది. ప్రయోగశాలల సముదాయపు ఆవరణ దాటింది కారు. మెయిన్‌ గేట్‌ వద్ద కూడా ఇద్దరు సెక్యూరిటీ జవాన్లు తమ తుపాకులతో అప్రమత్తంగా ఉన్నారు.
కాన్వెంట్‌ ఆవరణంలో ఆగింది కారు. తన కొడుకును కారులో ఎక్కించుకుని తిరిగి ఇంటికి బయలుదేరింది భారతి. ఆమె కారును మరో రెండు కార్లు వెంబడించడం మొదలుపెట్టాయి. ఆ రెండు కార్లలో విదేశీయులు ప్రయాణిస్తున్నారు. ఒక విదేశీయుడు కారు నడుపుతూ ఉంటే మరొకడు అతడి ప్రక్కనే కూర్చున్నాడు. వాళ్ల చూపులన్నీ భారతి కారు మీదే ఉన్నాయి. రెండు కార్లలో ఒకటి  వేగంగా ముందుకు వెళ్లింది. భారతి కారుకు అడ్డంగా తీసుకువచ్చి తన కారుని ఆపాడు విదేశీయుడు. తన కారును చప్పున ఆపింది భారతి. ఆ కారులోంచి ఇద్దరు విదేశీయులు దిగారు. వారిలో ఒకడు చురుకుగా భారతిని సమీపించాడు.

భారతి తన కారు తలుపు తెరిచి దిగబోయింది. ఏం జరిగిందో వాళ్లను అడిగి తెలుసుకోవాలని భావించింది ఆమె. అయితే కారును సమీపించిన విదేశీయులు చటుక్కున బాబును అందిపుచ్చుకుని కన్ను మూసి తెరిచేటంతలో తన కారులోకి పోయి కూర్చున్నాడు. రెండోవాడు కూడా డ్రైవింగ్‌ సీటులోకి చేరి కారును అతి తొందరగా బయలుదేరదీశాడు.
భారతి తన కళ్లను తానే నమ్మలేకపోయింది. తీరా సంఘటన అర్థం అయ్యాక ఆమెకు తన గుండె బద్దలైన అనుభూతి కలిగింది. ఇప్పుడు తన ప్రయాణం ఎటు? పోలీస్‌ స్టేషన్‌కా? బాబుని ఎత్తుకుపోతున్న కారు వైపా? ఆమె ఆలోచించుకునేలోపుగానే ఆమె మొబైల్‌ ఫోన్‌ మోగింది. స్టీరింగ్‌ వీల్‌ ప్రక్కనే ఉంది మొబైల్‌ ఫోన్‌ను పరిశీలించిన భారతి. పరిచయమైన నంబర్‌. ఫోన్‌ ఆన్‌ చేసింది. అవతల నుండి విచిత్రమైన ఇంగ్లీష్‌ యాసలో మాటలు వినిపిస్తున్నాయి. వాటి సారాంశం మాత్రం ఆమె బిడ్డను అపహరించిన ముఠాలోని మనిషే మాట్లాడాడు. బిడ్డ తమ వద్దే క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు వాడు. తమకు కావలసిన రక్షణ సమాచారాన్ని అందించి బిడ్డను తిరిగి పొందవలసిందిగా హెచ్చరించాడు వాడు.

‘‘మీకేం కావాలి?’’ అడిగింది భారతి బొంగురు గొంతుతో.. ఆమెకు గుండెలో కలుక్కుమంటోంది. తన కొడుకు అపహరణ ఆమె మెదడు మీద షాక్‌  ఇస్తోంది. మనిషి నీరుగారిపోతోంది.
‘‘రాత్రి ఎనిమిది గంటలకు మా సాంకేతిక నిపుణుడు మీ దగ్గరకు వస్తాడు. అతడు చెబుతాడు.. ఏం కావాలో!’’ అన్నాడు ఆ వ్యక్తి.
భారతికి అర్థమైపోయింది. వాళ్లకు కావలసింది సామాన్యమైన సమాచారం కాదని. దేశ భద్రతకు సంబంధించిన అంశం. తనను వాళ్లు లక్ష్యంగా చేసుకుని తన బిడ్డను ఎత్తుకుపోయారు. రక్షణ రహస్యాలను వారికి తానెందుకు ఇవ్వాలి? అవి తన ఆస్తి కావు. తన మీద చాలామంది పెద్ద అధికారులు, రక్షణ శాఖా మంత్రీ, ప్రధాన మంత్రీ ఉన్నారు. పరిశోధనాశాలలో తాను ఒక చిన్న పనిముట్టు మాత్రమే.
అవతలి ఫోన్‌ ఆగిపోయింది. స్విచ్‌ ఆఫ్‌ అయిపోయింది.
ఇంటికి చేరుకున్నదన్న మాటేగానీ భారతికి కన్నీళ్లు ఆగడం లేదు. రక్షణ శాఖలోని తన ఉద్యోగమే తన బిడ్డ ప్రాణాల మీదకు తెచ్చిందా? ఇప్పటికిప్పుడు తాను రాజీనామా చేసినా, తన బిడ్డను దుండగులు క్షేమంగా విడిచిపెట్టరుగాక విడిచిపెట్టరు.

‘‘డార్లింగ్‌’’ అంటూ వచ్చింది షీలా.
ముకుందరావుకు ఆమె అలా పిలిచినప్పుడల్లా శరీరం కంపరమెత్తుతోంది. పోలీస్‌ రిమాండ్‌లో ఉన్న తనను ఆమె మనుషులు విడిపించారు. తనకు కూడా ఆ సమయంలో వాళ్లు ఆపద్బాంధవులు మాదిరిగానే కనిపించారు. షీలా ఇంట్లో తనను ప్రవేశపెట్టారు. అవమాన భారంతో తాను కూడా తన ఇంటికి వెళ్లలేకపోయాడు. ఏమైతేనేం, ముకుందరావును ముగ్గులోకి దించింది షీలా. దుండగులు సామాన్యులు కారు. తిగిరి ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను తీసి బెదిరించారు. తమకు ఏం కావాలో వారు చెప్పారు. రెండోనాటి సాయంకాలానికే.. భారతి నుండి వాళ్లు తన కొడుకును ఎత్తుకువచ్చి.. తనకే చూపించారు. ఆ బిడ్డడిని షీలా ఒక తల్లిలాగా కాపాడుతుందని కూడా హామీ ఇచ్చారు దుండగులు. తన బెట్టింగ్‌ పాపం తనను ఏ స్థాయికి దిగజార్చిందీ ముకుందరావుకు అర్థమవుతోంది. షీలాతో తన సాన్నిహిత్యం, తన బిడ్డ అపహరణ... ఇదంతా అమాయకురాలైన తన భార్య భారతి ఎలా ఎదుర్కోగలుగుతుంది?

అతడి ఆలోచనకంటే మరింత ఇబ్బందిలో ఉంది భారతి. క్షిపణి రహస్యాలనూ, డిజైన్లనూ అడిగారు శత్రువులు. ఆకాశ మార్గాన రెండువేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సాధించే క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించింది. అంతకంటే మరో ఐదు వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సాధించే నైపుణ్యం సంపాధించింది భారతదేశం.
కేవలం శత్రు మూకలను అటకాయించడానికే తప్ప భారతదేశం ఏ దేశం మీదా తన ప్రతాపాన్ని ప్రదర్శించాలని అనుకోదు. అయితే అటువంటి శాంత స్వభావం కూడా ఉత్తర కొరియా వంటి దేశాలకు కంట్లో నలుసుగా తయారైంది.
ఉత్తర కొరియా వాడి కన్ను మన పరిశోధనల మీద పడింది. వాడి మనుషులే భారతిని వేధిస్తున్నారు. తన భర్త కూడా ఇటువంటి విపత్కర సమయంలోనే ఎక్కడికి పోయాడో, ఏమైపోయాడో తెలియని స్థితిలో ఉంది భారతి.
తనపై అధికారికి తన మీద జరుగుతున్న దాడి గురించి వివరించింది భారతి. క్షిపణుల రహస్యాలకు ప్రత్యేక డిజైన్లకు సంబంధించిన సాప్ట్‌వేర్‌ తెరవాలంటే పాస్‌వర్డ్‌ ఆ పై అధికారి వద్దే ఉంటుంది.
‘‘పాస్‌ వర్డ్‌ ఇస్తాను’’ అన్నాడు పై అధికారి.

తరువాత పావుగంట పాటు కంప్యూటర్‌ ద్వారా నెట్‌ ద్వారా ఏం చెయ్యాలో, ఎలాంటి కమాండ్స్‌ ఇవ్వాలో చెప్పాడు పై  అధికారి.
కొరియా వాడి కళ్లు మెరిశాయి. క్షిపణుల డిజైన్లూ, సాంకేతిక వివరాలూ అంతా కలసి యాభై పేజీల డేటా అతడి కంప్యూటర్‌కి భారతి వద్ద నుంచి అందింది.
ముకుందరావు తాను రిమాండ్‌ నుండి బయట పడినట్టు భారతితో నిజం చెప్పుకుని ఇల్లు చేరాడు. మరో గంటకు అపహరించబడిన బాబు కూడా క్షేమంగా ఇల్లు చేరుకున్నాడు. బాబుని దింపిన వాహనం వీధి మలుపు తిరుగుతుండగానే అటకాయించబడింది. పోలీస్‌ వాహనాలు ఆ కారును చుట్టుముట్టాయి. కారులో ఉన్న నలుగురు కొరియా మనుషులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తన కంప్యూటర్‌లో క్షిపణుల సమాచారం తెరిచాం, తెలుకున్నాం అనే సంతోషంలో కొరియా మనుషులు ఉన్నారే తప్ప, ఆ పని జరగగానే స్థావరం వివరాలు పోలీసులకు తెలిసిపోయినట్టు వాళ్లు గుర్తించలేకపోయాడు. మొత్తం ముఠా సులువుగా పట్టుబడిపోయింది.
అయినప్పటికీ భారతికి ఒక అసంతృప్తి  మిగిలిపోయింది. తన భర్త క్రికెట్‌ క్రీడా పందాలలో పాల్గొన్నప్పుటికీ.. షీలా అనే యువతితో లైంగిక సంబంధం కలిగి ఉన్నప్పటికీ.. ఆమె సహించింది. తన బిడ్డను తన భర్తే అపహరణ ప్రయత్నానికి ఊతం కల్పించడం ఆమెకు ఎంతమాత్రం నచ్చలేదు.
‘వ్యసనపరుడికి యుక్తాయుక్త విచక్షణా నశిస్తుందా?’ ఆమె కళ్లలో చాలాసేపటి వరకూ చెమ్మ అలాగే ఉండిపోయింది.
- ఎమ్‌.వి.వి. సత్యనారాయణ 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిజమే మాట్లాడు..

టారో వారఫలాలు (జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు)

వారఫలాలు (జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు)

బీ47 గదిలో ఏముంది?

అరే సీనుగా.. పెళ్లిబువ్వరా.!

సిరా చుక్క.. నెత్తుటి మరక...

రైటర్‌ కాపీరోవా ఆండ్రూ కథనం ప్రకారం..

గడ్డిపరకా..! నీకు కూడా చులకనయ్యానా?!

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

శివానంద లహరి

ఔషధం కురిసే వేళ..

పసందైన రుచుల సమాహారం

గడసరి బుజ్జిమేక

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

నేరం దాగదు..

ఇది సహజమేనా?

అందుకే కాంపౌండ్‌ వాల్‌ ఉండాలి!

అంపకాల్లో కోడిగుడ్డు దీపం

దరువు పడిందో.. చావు డప్పు మోగాల్సిందే!

ఒక ఖైదీ ప్రేమకథ

దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు

వ్యాసుడి పలుకులు

వీరికి అక్కడ ఏం పని?!

ద్రుపదుడి గర్వభంగం

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

హీరో సూరి

డూప్‌ లేకుండానే...

తొలి అడుగు పూర్తి

నా కామ్రేడ్స్‌ అందరికీ థ్యాంక్స్‌

హాసన్‌ని కాదు శ్రుతీని!