భూతల నరకం

24 Jul, 2016 02:05 IST|Sakshi
భూతల నరకం

భూతల నరకం అనే మాటను విని ఉండకపోవచ్చు గానీ... చూడవచ్చు! . ఇథియోపియాలోని ‘ఎర్టా ఆలే’ను భూతల నరకం (గేట్ వే ఆఫ్ హెల్) అని పిలుస్తారు. భూమి అంతర్గత పొరల్లో ఉండే తీవ్రమైన ఉష్ణోగ్రత వల్ల రాళ్లు సైతం కరగి ద్రవరూపంలోకి మారుతాయి. ఇలా కుతకుతలాడిపోయే రాతి ద్రవాన్ని లావా అంటారన్న విషయం తెలిసిందే. ఎర్టా ఆలే అన్నది నిజానికి ఒక అగ్నిపర్వతం. అయితే దీని వాలు మరీ ఎక్కువగా ఉండదు. దీని ఎత్తు కేవలం 613 మీటర్లు మాత్రమే. అయితే వాలు తక్కువగా ఉన్న దీని ముఖద్వారం (క్రేటర్) నుంచి లావా ఉడికిపోతూ పైకి ఉబుకుతూ ఉంటుంది.  

ఈ లావా అంతా ఒక ద్రవరూప అగ్నిసరస్సులా ఉంటుంది. ప్రపంచంలోని ప్రాచీన అగ్నిసరస్సులలో ఇది కూడా ఒకటి. 1906 నుంచి రగులుతూనే ఉంది.శాస్త్రీయ వాస్తవాలతో సంబంధం లేకుండా  ఈ అగ్నిసరస్సు చుట్టూ ఎన్నో కాల్పనిక కథలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు