వారఫలాలు :16 జూలై నుంచి 22 జూలై 2017 వరకు

16 Jul, 2017 02:06 IST|Sakshi
వారఫలాలు :16 జూలై నుంచి 22 జూలై 2017 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు పదవులు, సన్మానాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఎదురుచూడని ఉద్యోగావకాశాలు దగ్గరకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. ఇంటి నిర్మాణాలు చేపట్టే అవకాశముంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగస్తుల సేవలకు గుర్తింపు రాగలదు. వారం మధ్యలో వివాదాలు. అనుకోని ఖర్చులు. నీలం, లేత పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. భూములు, వాహనాలు సమకూరతాయి. విద్యార్థులకు పోటీపరీక్షల్లో మంచి ఫలితాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. ఆకుపచ్చ, లేత నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు అనుకూల సమాచారం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులు సమర్థతను చాటుకుంటారు. కళాకారులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నేరేడు, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
 అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఆస్తిలాభ సూచనలు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల విస్తరణలో అనుకూలత. ఉద్యోగస్తులకు పైస్థాయి వారి నుంచి అభినందనలు. రాజకీయవర్గాలకు నూతన పదవీయోగం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. కుటుంబసమస్యలు. ఎరుపు, లేత ఆకుపచ్చరంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తుతి మంచిది.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దక్కుతాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక అశాంతి. పసుపు, నీలం రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. ఆకుపచ్చ, బంగారు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడతారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు. గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. విద్య, ఉద్యోగావకాశాలు దగ్గరకు వస్తాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. కళాకారులకు అనుకోని అవకాశాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. ఎరుపు, ఆకుపచ్చరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు ఎదురుకావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. గులాబీ, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌స్తోత్రాలు పఠించండి.


మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొన్ని పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక విషయాలలో చికాకులు కాస్త తొలగుతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనయోగం. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. మానసిక అశాంతి. నలుపు, లేత నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలు నిరాశపరుస్తాయి. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమ మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం తప్పదు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. ఆకుపచ్చ, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. రాబడి సంతృప్తినిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. యత్నకార్యసిద్ధి. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రశంసలు. కళాకారులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మరిన్ని వార్తలు