ఒబామా మాటలు – ముత్యాల మూటలు

7 Jan, 2018 00:35 IST|Sakshi

అవలోకనం

ఆన్‌లైన్‌లో కనబడే స్థాయి కశ్మలం, రోత మన నిత్య జీవితాల్లో ఎక్కడా కనబడవన్నది నిజం. రాజకీయాలు, మతం వగైరాలపై ముఖాముఖీ కలుసుకున్నప్పుడు వాదించుకుంటే ఇంత చేటు దూషణలు, అవమానకరంగా మాట్లాడటం ఉండనే ఉండదు. ఇంటర్నెట్‌ మనల్ని గోప్యంగా ఉంచుతుందన్న భావనే ఇష్టానుసారం ఏమైనా మాట్లాడవచ్చునన్న ఆత్మ విశ్వాసాన్ని మనలో ఏర్పరుస్తుంది. వ్యక్తిగతంగా మనమంతా సమ్యక్‌ దృష్టితో మెలగుతాం. ఎవరో మనల్ని గమనిస్తున్నారన్న భావన వల్లే ఇలా ఉండగలుగుతాం.

మన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాదిరే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా ప్రపంచం గుర్తించి గౌరవించే మేధావి. వీరిద్దరూ విఫల నేతలేనని కొందరనుకుంటారు. అందుకు ఒక కారణం ఉంది. మన్మోహన్‌ వలే జనాకర్షణ శక్తిగానీ, సొంతబలంగానీ లేకపోవడం... ఒబామాలా జాతిపరంగా మైనారిటీ నేతలన్న భావం వీరిపట్ల ఉండటం ఆ కారణమని నేననుకుంటాను. అయితే ఈ నాయకులిద్దరూ ఇతర నేతల్లా తరచు మాట్లాడకపోవచ్చుగానీ చాలా తెలివైన వారు. వారు మాట్లాడినప్పుడు వినడం అనివార్యంగా మనకు ప్రయోజనకరమవు తుంది. కొన్ని రోజులక్రితం బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ హ్యారీకి ఒబామా అద్భుత మైన ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన సామాజిక మాధ్యమాల గురించి, ఆధునిక ప్రపంచంపై దాని ప్రభావం గురించి ఎంతో చక్కగా మాట్లాడారు. ఉమ్మడి ప్రయోజనాలుండే వారందరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికీ, సంబంధబాంధవ్యాలు నెలకొల్పుకోవడానికీ ఈ మాధ్యమాలు నిజంగా శక్తివం తమైన ఉపకరణాలన్న సంగతిని ఆయన అంగీకరించారు. ‘అయితే ఇలాంటి వారంతా ఏ పబ్‌లోనో, ప్రార్థనాలయం వద్దనో, మరెక్కడైనా కలుసుకోవాలి. ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు గల కారణం కూడా చెప్పారు.

‘ఇంటర్నెట్‌లో ఏర్పడ్డ సంబంధాల్లో అంతా సూక్ష్మంగా, సాధారణంగా కనిపిస్తుంది. కానీ ముఖాముఖీ కలిసినప్పుడు మాత్రమే అవ తలివారెంత సంక్లిష్టమైనవారో అర్ధమవుతుంది’ అని ఆయన వివరించారు. ‘ఇంటర్నెట్‌తో ఉన్న మరో ప్రమాదమేమంటే తమకు దానిద్వారా పరిచయమయ్యే వారిలో వేరే రకమైన వాస్తవాలు దాగి ఉండొచ్చు. పర్యవసానంగా వారు తమ కుండే దురభిప్రాయాలను బలపర్చుకునే సమాచారంలోనే కూరుకుపోతారు’ అని కూడా ఒబామా అభిప్రాయపడ్డారు. మనం ఇంటర్నెట్‌ ఉపయోగించే తీరుకు సంబంధించి ఆయనొక ముఖ్యమైన, అవసరమైన విషయాన్ని పట్టుకున్నారని నాకనిపిస్తుంది. వ్యక్తిగతంగా నేను ఏ  సామాజిక మాధ్యమాల్లో లేను. ఎందుకంటే అవి మన ఏకాగ్రతను భంగపరుస్తాయి. నా ఆన్‌లైన్‌ వ్యాసాలపై వచ్చే వ్యాఖ్యలను గమనించినప్పుడు నా మనసెంతో వ్యాకులపడుతుంది. ఆ వ్యాఖ్యల్లో కనబడే ఆగ్ర హమూ, దుర్మార్గమూ, మితిమీరిన భాష గమనిస్తే ఎవరినైనా దూరం పెట్టక తప్ప దనిపిస్తుంది.


ఆన్‌లైన్‌లో కనబడే స్థాయి కశ్మలం, రోత మన నిత్య జీవితాల్లో ఎక్కడా కన బడవన్నది నిజం. రాజకీయాలు, మతం వగైరాలపై ముఖాముఖీ కలుసు కున్నప్పుడు వాదించుకుంటే ఇంత చేటు దూషణలు, అవమానకరంగా మాట్లా డటం ఉండనే ఉండదు. ఇంటర్నెట్‌ మనల్ని గోప్యంగా ఉంచుతుందన్న భావనే ఇష్టానుసారం ఏమైనా మాట్లాడవచ్చునన్న ఆత్మ విశ్వాసాన్ని మనలో ఏర్పరు స్తుంది. వ్యక్తిగతంగా మనమంతా సమ్యక్‌ దృష్టితో మెలగుతాం. ఎవరో మనల్ని గమనిస్తున్నారన్న భావన వల్లే ఇలా ఉండగలుగుతాం. ఒబామా చెప్పిన మరో ముఖ్యాంశమేమంటే మనం ప్రత్యేకించి ఎంపిక చేసుకుంటే తప్ప లేదా కోరుకుంటే తప్ప అతడు/ఆమె వైఖరేమిటో మనకు తెలిసే అవకాశం లేదు. నిజజీవితంలో ఎవరితోనైనా మనం వ్యవహరిస్తున్నప్పుడు వారు చెప్పేది కూడా మనం విని తీర వలసి వస్తుంది. అది మన నిశ్చయాన్ని, మన ప్రతికూల అభిప్రాయాలను పల్చ బారుస్తుంది. ఒబామా మనకిచ్చిన లోచూపు నుంచి మనం కొన్నిటిని గ్రహిం చవచ్చు. అందులో మొదటిది–తమ పని ద్వారా మార్పునాశించే క్రియాశీలవా దులు, రాజకీయ నాయకులు ఇంటర్నెట్‌ ద్వారా కాక నేరుగా ప్రజలను కలుసు కోవాలి.

వారితో సంబంధాలు నెలకొల్పుకోవాలి. నేను పనిచేసే చోటుకు కొన్ని వారాల క్రితం దళిత నాయకుడు జిగ్నేశ్‌ మేవానీ వచ్చారు. ఆయన తన దృక్కో ణాన్ని, ఆశలను వివరించారు. ఎన్నికల రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు అది తన స్వల్ప కాల లక్ష్యమేమీ కాదని, పదిపదిహేనేళ్లుగా అందులో విజయం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. రెండు ప్రధాన పార్టీలు మాత్రమే బలంగా ఉండే గుజరాత్‌లాంటి రాష్ట్రంలో స్వతంత్ర అభ్యర్థిగా సులభంగా నెగ్గుతానని ఆయన ఎప్పుడూ అనుకుని ఉండరు. పైగా ఆయనకు బాగా ప్రాచుర్యంలో ఉన్న ఎన్నికల గుర్తు లేదు. కేవలం తన సొంత విశ్వసనీయతే ఆధారం. మరి ఇదెలా సాధ్యమైంది? తెలివిగా మాట్లాడటం, ఒప్పించే గుణం ఉండే ప్రసంగాలు చేయ డం... వేలాదిమందిని వ్యక్తిగతంగా కలవడం వల్లే మేవానీ గెలుపు సాధించగలి గారని నేననుకుంటున్నాను.

నావంటి మానవ హక్కుల కార్యకర్త కూడా ఇదేవిధంగా జనాన్ని కలుసు కోవాలి. ఇది నేనెందుకు చెబుతున్నానంటే క్రియాశీల ప్రపంచం సామాజిక మాధ్యమాలపైనే దృష్టి పెడుతుంది. దానిద్వారా భారీ సంఖ్యలో ప్రజలకు చేరువ కావొచ్చునన్నది అందులో పనిచేసేవారి అభిప్రాయం. కానీ ఒబామా చెప్పినట్టు ఆ మాధ్యమాలు కృత్రిమంగా విభజితమై ఉంటాయి. నిరాదరణకు లోనయ్యే ముస్లింలు, దళితులు, ఆదివాసీలు లేదా కశ్మీరీ ప్రజల హక్కుల కోసం పనిచేసే వారికి మీరు సైనికుల హక్కుల గురించి మాట్లాడరేమన్న ప్రశ్న తరచుగా ఎదుర వుతుంది. ఇంటర్నెట్‌లో అయితే ఇలాంటి తప్పుడు ద్వంద్వాలను సులభంగా కొనసాగేలా చూడొచ్చు.

ముఖాముఖీలో అవతలి వ్యక్తి ఆందోళనల్ని కొట్టిపారే యడం అంత సులభం కాదు. మనం మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూసి నిరాశ పడనవసరం లేదని (తరచు నాకు అలా అనిపిస్తుంటుంది) ఒబామా అంతర్‌దృష్టి చెబుతుంది. అంతమాత్రాన సామాజిక మాధ్యమాలు ఉత్త చెత్త అని ఒబామా అన్నారని మనం అర్ధం చేసుకోకూడదు. ‘బహుళ విధ స్వరాలను అనుమతించేలా, అదే సమయంలో సమాజంలో చీలికలు తీసుకు రాకుండా, ఒక ఉమ్మడి భూమికను కనుగొనేలా రూపొందడం కోసం మనం ఈ సాంకేతికతను ఎలా నియంత్రణలోకి తెచ్చుకుంటామన్నదే ప్రశ్న’ అని ఆయన చెప్పిన సంగతిని గుర్తుచేసుకోవాలి. అత్య ద్భుతమైన ఈ మాటలు మన దేశానికి ఎంతో కీలకమైన ఈ కొత్త సంవత్సరంలో గుర్తుంచుకోదగ్గవి.

ఆకార్‌ పటేల్‌
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
aakar.patel@icloud.com

మరిన్ని వార్తలు