మా నాన్నే మాకు నిరంతర ప్రేరణ

28 Nov, 2018 01:40 IST|Sakshi
కుమార్తెతో జమాల్‌ ఖషోగ్గి 

సందర్భం

జమాల్‌ ఖషోగ్గి జటిల మైన వ్యక్తి. కానీ ఆయన  కుమార్తెలమైన మాకు  ఆయన సింపుల్‌ ‘డాడ్‌’ మాత్రమే.  మా కుటుంబా నికి ఆయన చేసే పనంటే గౌరవం. ఆయన పాస్‌ పోర్ట్‌ నిండా ఎన్నో దేశాల ముద్రలు, తిరిగి వచ్చిన ప్రదేశాల ఆనవాళ్లూ ఉండేవి. తెచ్చిన అనేక పత్రి కలు, పుస్తకాలు, ముతక వాసన వేస్తూ, ఆయన టేబుల్‌ చుట్టూ  క్లిప్పింగులుగా  అమర్చి ఉండేవి నిత్యమూ. తిరిగి వచ్చేటప్పుడు, ఆయన మాకెన్నో బహుమతులను తేవడమే కాక, ఉత్కంఠ  కలిగించే  దూరదేశాల కథలెన్నో చెప్పే వాడు.  
    
మేం అమ్మా నాన్నల జ్ఞాన సముపార్జన ప్రేమ వలయంలో పెరిగాం. వాళ్ళు మమ్మల్ని ఎన్నో  మ్యూజియంలకు, చారిత్రిక ప్రదేశాలకు  తీసుకువెళ్లి, అవన్నీ విపులంగా చెప్పేవారు. జెడ్డా నుంచి మెదినా దాక కార్‌లో ప్రయాణం చేసేటప్పుడు చుట్టూ çవున్న ప్రదేశాల చారిత్రిక ప్రాధాన్యత మాకు చెప్పేవారు. ఎప్పుడూ ఆయన తన చుట్టూ పుస్తకాలతో ఉన్నా, ఇంకా పుస్తకాలు కావాలనే వారు. చదివిన విస్తార  గ్రంథాలలో,  ఎప్పుడూ ఇవే కావాలి అనో, అవి వద్దు అనో ఆయనకు ఎంపికలు ఉండేవి కావు. ఆ పుస్త కాల్లోని భిన్న వాదనలు, అభిప్రాయాలను ఆకళింపు చేసుకునేవారు. 

ఆయన జీవితం నిండా ఎన్నో అనూహ్యమైన మలుపులు, మెలికలు. అవి మా కుటుంబాన్నంత   టినీ ప్రభావితం  చేసేవి. కొద్ది సంవత్సరాల వ్యవ      ధిలో, ఎవరైనా రెండుసార్లు ఉద్యోగం నుంచి తొలగించబడి ఉండరు. ‘అల్‌ వతన్‌’ పత్రిక  ప్రధాన  సంపాదకులుగా ఉండగా నాన్నకి ఈ అనుభవం ఎదురయింది. ఏం జరిగినా సరే, నాన్న ఒక ఆశా వాది. ప్రతి సవాలులో ఒక కొత్త అవకాశాన్ని చూడడం నాన్న తత్వం. అభిప్రాయాలు వ్యక్తపర్చ    డం, తన  భావాలను పంచుకోవడం నాన్నకి  చాలా  ముఖ్యమైన  అంశం. అలాగే  ఆయనకి రచన కేవలం  పని కాదు. అదొక తప్పనిసరి కర్తవ్యం. 

రంజాన్‌ పండుగ రోజుల్లో మేం వర్జీనియాలో ఉండగా, ఏడాదిగా తన కోసం నిర్మించుకున్న చిన్న లోకాన్ని చూపించాడు. మమ్మల్ని తన  స్నేహితులకు పరిచయం చేశాడు. తను తరచుగా  వెళ్లే  ప్రదేశాలు చూపెట్టాడు. అక్కడ అమెరికాలో ఎలా తన కోసం ఒక చిన్న లోకం ఏర్పాటు చేసుకున్నాడో, అలాగే, తన స్వదేశం సౌదీ చూసేందుకు, తన కుటుంబాన్ని, తన ప్రియ సహచరులను కలిసేందుకు తపన పడే వాడు. 

సౌదీ అరేబియా  వదిలి వెళ్లవలసిన రోజున తన గుమ్మంలో నిలబడి తను తిరిగి వస్తానా మళ్ళీ, అన్న అబ్బురపాటుకి గురయ్యాను అని చెప్పాడు. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, చేసిన ప్రయా ణాలు, వీటివల్ల ఎంత తలమునకలుగా ఉన్నా, తాను తిరిగి స్వదేశం వస్తాను అన్న ఆశతోనే నాన్న బతికారు. ఎందుకంటే, నిజానికి, నాన్న అసమ్మతి దారు కాదు. 

అక్టోబర్‌ రెండు తరువాత, మా కుటుంబం వర్జీనియాలో నాన్న ఇంటికి వెళ్లాం. అక్కడ మా గుండెలు కలచి వేసింది, నాన్న కూచునే ఖాళీ కుర్చీ. ఆయన లేని శూన్యం మా చెవుల్లో హోరెత్తింది. మాకు అక్కడ కూచుని ఉన్న నాన్న కనిపిస్తున్నాడు. తలపైకి  పెట్టుకున్న  కళ్ళద్దాలు, ఏదో చదువుతూ,  తీరిక లేకుండా. ఆయన  రచనలు చూస్తూ ఉంటే, తాను సౌదీ తిరిగి వచ్చే నాటికి, తనకు, ఇతర సౌదీ పౌరులకు, ఆ దేశం మరింత జీవన భద్రతతో కూడిన మెరుగైన ప్రాంతంగా మారాలన్న ఆశ కనిపిస్తుంది. 

ఇది నాన్నకి నివాళి కాదు. ఎందుకు కాదు అంటే నివాళి అయితే, అక్కడితో ఈ విషయం ఆగి  పోతుంది. అంతకన్నా ముఖ్యంగా ఇదొక  వాగ్దానం. ఆయన వేలార్చిన కాంతి ఎప్పటికీ వెలిసి పోదు అని. ఆయనకు జ్ఞానం, సత్యం అంటే ఉన్న గౌరవం, ప్రేమ  మాకు  నిరంతర ప్రేరణ. వచ్చే జన్మలో మేము ఆయనను కలిసే దాకా. 

– నోహా ఖషోగ్గి, రజన్‌  జమాల్‌ ఖషోగ్గి
(అక్టోబర్‌ రెండున టర్కీ లోని సౌదీ  అరేబియా రాయబార  కార్యాలయంలో,  సౌదీ రాజ్య ఆమో దంతో 58 ఏళ్ల జమాల్‌ ఖషోగ్గి హత్యకు గుర  య్యారు. ఆయన కుమార్తెలు నిండైన ఆత్మ గౌర వంతో చేసిన రచనకు తెలుగు అనువాదం)
   
వ్యాసకర్త : రామ తీర్థ,  ప్రముఖ కవి, రచయిత
మొబైల్‌ : 98492 00385 

మరిన్ని వార్తలు