సబ్‌ప్లాన్‌పై అధ్యయన కమిటీ ఏర్పాటు

29 Jan, 2017 02:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్టీ ఉప ప్రణాళికలో సవరణల కోసం గిరిజనసంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న బడ్జెట్‌ కేటాయింపుల్లో మార్పు లను దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై దృష్టి సారించేందుకు ఈ కమిటీని నియమించారు. ఎస్టీల సంక్షేమం, అభివృద్ధికి కొత్త పథకాలను సిఫార్సు చేయాలని ఈ కమిటీకి ప్రభుత్వం నిర్దేశించింది. కమిటీ సభ్యులుగా ఎంపీలు సీతారాం నాయక్, జి.నగేశ్, ఎమ్మెల్సీ రాములునాయక్, ఎమ్మెల్యేలు డీఎస్‌ రెడ్యానాయక్, కోవా లక్ష్మి, సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు నియమితుల య్యారు. ఈ మేరకు ఎస్టీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు.  
 

మరిన్ని వార్తలు