చెన్నైలో తెలుగువారిని రక్షించిన ఎయిర్ఫోర్స్

3 Dec, 2015 11:48 IST|Sakshi

చెన్నై: భారీ వర్షాలతో చెన్నై వాసులు తీవ్ర అవస్తలు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారికి భారత వైమానిక దళం సహాయం అందిస్తోంది. ఇప్పటికే వర్షాలతో తమిళనాడులో 250 మందికి పైగా మృత్యువాత పడినట్లు సమాచారం. గురువారం వరదల్లో చిక్కుకున్న 200 మంది తెలుగువారిని ఎయిర్ ఫోర్స్ రక్షించి బేగంపేట విమానాశ్రయానికి చేర్చారు. చెన్నైలోని తెలుగువారికి సహాయం అందిస్తామని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

 

మరిన్ని వార్తలు