సంక్రాంతి దాకా చలి...ఆపై ఎండల దాడి

9 Jan, 2016 22:22 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుత చలి సంక్రాంతి వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

'కొన్నాళ్ల నుంచి వీస్తున్న తూర్పు, ఆగ్నేయ గాలులు మళ్లీ దిశ మార్చుకున్నాయి. ప్రస్తుతం ఇవి ఆగ్నేయ, దక్షిణ దిశ నుంచి వీస్తున్నాయి. ఫలితంగా చలిగాలుల ఉధృతికి కాస్త అడ్డుకట్ట పడినట్టయింది. లేకుంటే కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గిపోయేవి. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఒకట్రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. దక్షిణ, ఆగ్నేయ గాలుల ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికంటే తగ్గే అవకాశం లేదు. సంక్రాంతి తర్వాత  మాత్రం ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయి' అని విశాఖ వాతావరణ శాఖ మాజీ అధికారులు చెప్పారు.

>
మరిన్ని వార్తలు