షకీల్, బిల్లాలపై హత్యాయత్నం కేసు కొట్టివేత

28 Oct, 2014 14:22 IST|Sakshi

గుజరాత్ పోలీసుల మీద దాడికేసులో హైదరాబాద్ నగరానికి చెందిన మౌతసిన్ బిల్లా, షకీల్లపై కేసును నాంపల్లి కోర్టు కొట్టేసింది. అయితే ఇదే కేసులో మరో ముగ్గురికి మాత్రం నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. బలియుద్దీన్, వలియుద్దీన్, షఫీద్ అనే ముగ్గురికి ఈ శిక్ష విధించారు. 2004 సంవత్సరంలో డీజీపీ కార్యాలయం ముందు జరిగిన ఆందోళనలో.. గుజరాత్ పోలీసుల మీద హత్యాయత్నం చేశారంటూ మౌతసిన్ బిల్లా, షకీల్ల మీద కేసు నమోదైంది. 2004 సంవత్సరంలో గుజరాత్ హోం శాఖ మంత్రి హరేన్ పాండ్పయ హత్య కేసులో నసీరుద్దీన్ షాను గుజరాత్ పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు.

నసీరుద్దీన్ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ డీజీపీ ఆఫీసు ముందు ఆందోళన కారులు ధర్నా చేసి.. గుజరాత్ పోలీసులు మీద దాడి చేశారు. దాంతో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపగా, మౌతసిన్ బిల్లా సోదరుడు సలీం మృతిచెందాడు. ఈ నేపథ్యంలో అటు మౌతసిన్ బిల్లా, షకీల్లపై హత్యాయత్నం కేసు నమోదు కాగా... గుజరాత్ పోలీసులపై హత్యకేసు నమోదైంది. రెండో కేసు విషయం ఏమైందీ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు