బోనమెత్తిన గోల్కొండ

26 Jun, 2017 10:12 IST|Sakshi
బోనమెత్తిన గోల్కొండ
- ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తొట్టెల 
వేలాదిగా తరలివచ్చిన భక్తులు 
 
సాక్షి, హైదరాబాద్‌: పోతురాజు విన్యాసాలు, సంప్రదాయ నృత్యాలు, శివసత్తుల ప్రదర్శన.. డప్పు వాయిద్యాలు.. కోలాటాలు.. భక్తజనం సమర్పించిన బోనాలతో గోల్కొండ బోనమెత్తింది. హైదరాబాద్‌ నగరా నికి తలమానికమైన గోల్కొండలో ఆషాఢ జాతరగా పిలిచే తొలి బోనాల ఉత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. లంగర్‌హౌజ్‌ నుంచి గోల్కొండ వరకు ఆధ్యా త్మిక వాతావరణం వెల్లి విరిసింది. భక్తజనం వెంట రాగా జగదంబిక మహంకాళి అమ్మవారి రథం లంగర్‌హౌజ్‌ నుంచి ముందుకు కదిలి, సాయంత్రానికి గోల్కొండ కోటపైన ఉన్న జగదంబికా అమ్మ వారి ఆల యం వద్దకు చేరింది. వేలాది భక్తులు అమ్మవారి కి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. 
 
బోనాలు ప్రారంభమయ్యాయిలా...
ఈ బోనాల సందర్భంగా తొలిపూజను చోటా బజార్‌లోని ప్రధాన అర్చకుడు అనంతాచారి ఇంట్లో నిర్వహించారు. అనంతరం వేదపండి తులు రామాకాంత్‌ వైద్యుల ఇంట్లో వేదశాస్త్రం ప్రకారం పీఠపూజ చేశారు. ఉదయం 11 గంట లకు లంగర్‌హౌస్‌ గాంధీ విగ్రహం నుంచి ప్రా రంభమైన ఊరేగింపు సాయంత్రం 5 గంటలకు గోల్కొండ కోటకు చేరుకుంది. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, సాకపోసి బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన తొట్టెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాతబస్తీ చార్మినార్‌ నుంచి ప్యారసాని శ్రీనివాస్‌ ప్రత్యేకంగా 25 అడుగుల ఎత్తున తయారు చేసిన తొట్టెల భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారి ఊరేగింపులో ప్రత్యేక అలంకరణతో తయారు చేసిన హంసవాహనం వేలాదిమంది భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 
మరిన్ని వార్తలు