రూ.2 కోట్ల విలువైన సిగరెట్ల పట్టివేత

29 Sep, 2016 17:40 IST|Sakshi

శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం భారీగా విదేశీ సిగరెట్లు పట్టుబడ్డాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఈ సిగరెట్లకు ఎటువంటి అనుమతులు లేవని అధికారులు తెలిపారు. పన్నులు చెల్లించకుండా తీసుకువచ్చిన ఈ ఖరీదైన విదేశీ బ్రాండ్ల సిగరెట్ల విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. సిగరెట్ల బండిళ్లను సీజ్ చేసి, సంబంధీకుల కోసం విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు