అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి

29 Oct, 2016 03:49 IST|Sakshi
అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి

ప్రజలకు గవర్నర్ దీపావళి శుభాకాంక్షలు..రాజ్‌భవన్‌లో వేడుకలు
హైదరాబాద్: దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆకాంక్షించారు. దీపావళిని పురస్కరించుకుని శుక్రవారం రాజ్‌భవన్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు సరదాగా నిర్వహించిన కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో గవర్నర్ దంపతులు పాల్గొని సందడి చేశారు. ఉద్యోగులు, వారి పిల్లలకు ఆటపాటల పోటీలు నిర్వహించారు. గవర్నర్ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, గవర్నర్ సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి, ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు