‘మక్కా’ నిందితులు మరణించారా?

2 Jan, 2017 04:20 IST|Sakshi
‘మక్కా’ నిందితులు మరణించారా?

- వాంటెడ్‌గా ఉన్న రామ్‌చంద్ర, సందీప్‌ ధాంగే
- 2008లో ‘చనిపోయారన్న’ ఏటీఎస్‌ మాజీ అధికారి

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీలోని మక్కా మసీదు లో 2007 మే 18న జరిగిన బాంబు పేలుడు కేసులో వాంటెడ్‌ నిందితులుగా ఉన్న రామ్‌చంద్ర కస్సంగ్రా, సందీప్‌ ధాంగే ‘మరణించారా’..? మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌(ఏటీఎస్‌) మాజీ ఇన్‌స్పెక్టర్‌ మహబూబ్‌ ముజావర్‌ ఇటీవల అక్కడి న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌ ఈ అను మానాలకు తావిస్తోంది. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ముజావర్‌ గత వారం ఓ జాతీయ టీవీ చానల్‌తో మాట్లాడుతూ ఆ ఇద్దరూ 2008లోనే ఏటీఎస్‌ కస్టడీలో చనిపోయారని ప్రకటించారు. తనకు ‘ఆ విషయం’ తెలిసినందుకే తనపై అక్రమం గా కేసులు బనాయించి అప్రతిష్టపాలు చేశారని పేర్కొన్నారు.

మక్కా మసీదు పేలుడు ఘటనలో 9 మంది ప్రాణాలు విడువగా.. ఆ తర్వాత అల్లర్లను అదుపు చేయడానికి జరిగిన పోలీసు కాల్పుల్లో మరో ఐదుగురు మరణించారు. 58 మంది క్షతగా త్రులయ్యారు. హుస్సేనిఆలం పోలీసుస్టేషన్‌లో నమోదైన ఈ కేసులు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ సెల్‌కు.. అక్కడ నుంచి సీబీఐ వెళ్లాయి. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తు చేస్తోంది.

ముంబై దాడుల రోజే: ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ముజావర్‌ ప్రకటనతో ‘మక్కా’తో పాటు మాలే గావ్, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ పేలుడు, అజ్మీర్‌ దర్గా బ్లాస్ట్‌ కేసులు కొత్త మలుపు తిరిగాయి. ఈ కేసులన్నింటిలోనూ రామ్‌చంద్ర, సందీప్‌ నిందితు లుగా ఉన్నారు. వీరిద్దరినీ మాలేగావ్‌ కేసు దర్యాప్తు నేపథ్యంలో మహారాష్ట్ర ఏటీఎస్‌ అధికారులు 2008లోనే పట్టుకున్నారని ముజావర్‌ పేర్కొన్నారు. ఆ టీమ్‌లో తానూ సభ్యుడిగా ఉన్నానని, 26/11 ముంబై దాడులు జరిగిన 2008 నవంబర్‌ 26న వీరిద్దరూ ఏటీఎస్‌ కస్టడీలో చనిపోయారని సంచల నాత్మక ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు, అంశాలను న్యాయస్థానం ముందు ఉంచుతానం టూ షోలాపూర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో గత నెల మొదటి వారంలో అఫిడవిట్‌ దాఖలు చేశారు. దీంతో ప్రస్తుతం దర్యాప్తు, నిఘా వర్గాల కన్ను ముజావర్‌తో పాటు ఏటీఎస్‌పై పడింది. ఆదాయానికి మించి ఆస్తులు, ఆయుధ చట్టం కింద నమోదైన రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న ముజావర్‌ అఫిడవిట్‌ ఎంత వరకు వాస్తవమనేది ఆరా తీస్తున్నాయి.

‘మాలేగావ్‌’తో వీడిన చిక్కుముడి..
మక్కా మసీదులో పేలుడు జరిగిన 3 నెలలకు రాజస్థాన్‌లోని అజ్మీర్‌ దర్గాలో బాంబు పేలింది. ఈ రెంటికీ సారూప్యతలు ఉండటంతో ఒకే మా డ్యుల్‌ పనిగా అనుమానించారు. మహా రాష్ట్రలోని మాలేగావ్‌ పేలుడు(రెండోసారి) కేసు లో ఏటీఎస్‌ అధికారులు అభినవ్‌ భారత్‌కు చెం దిన సాథ్వీ ప్రజ్ఞాసింగ్, శ్రీకాంత్‌ పురోహిత్‌ను 2008 అక్టోబర్‌ 28న అరెస్టు చేశారు. వీరి విచార ణలో అజ్మీర్‌ పేలుడుకు బాధ్యులైన దేవేంద్ర, లోకేష్, రామ్‌చంద్ర, సందీప్‌ పేర్లు వెలుగులోకి వచ్చా యి. 2010 ఏప్రిల్‌ 28న రాజస్థాన్‌ ఏటీఎస్‌ అధికారులు దేవేంద్రగుప్తా, లోకేష్‌ శర్మను పట్టు కున్నారు. విచారణలో ‘మక్కా’ పనీ తమదేనని అంగీకరించడంతో మూడేళ్ల తర్వాత చిక్కుముడి వీడింది. ‘మక్కా’ కేసులో మొత్తం ఆరుగురిని నిందితులుగా గుర్తించారు. మూడేళ్ల తర్వాత సీబీఐ.. దేవేంద్ర, లోకేష్‌లను పీటీ వారెంట్‌పై తీసుకురావడంతోపాటు స్వామి అశిమా నందను అరెస్టు చేశారు. మరో నిందితుడు సునీ ల్‌జోషి 2007లోనే హత్యకు గురయ్యాడని తేలిం ది. రామ్‌చంద్ర, సందీప్‌ థాంగే ఇప్పటికీ పరారీ లోనే ఉన్నారని అధికారులు అంటున్నారు.

మరిన్ని వార్తలు