చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ బస్సుకు నిధులు విడుదల

5 Mar, 2016 09:34 IST|Sakshi
చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ బస్సుకు నిధులు విడుదల

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలు, మారుమూల ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన బుల్లెట్ ప్రూఫ్ బస్సుని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. రూ.5.05 కోట్ల అంచనా వ్యయంతో చండీగఢ్‌కు చెందిన జేసీబీఎల్ సంస్థ నుంచి ఈ బస్సు కొనుగోలు నిమిత్తం తుది విడతగా రూ.కోటి ఇరవై ఆరు లక్షలను విడుదల చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి శశిభూషన్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే వాయిదాల్లో రూ.రెండున్నర కోట్లు విడుదల చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు