ఖరీఫ్ పంటలు అధ్వానం

28 Aug, 2016 03:17 IST|Sakshi
ఖరీఫ్ పంటలు అధ్వానం
 మంత్రికి జిల్లా వ్యవసాయాధికారుల నివేదన
హైదరాబాద్: ప్రస్తుతం ఖరీఫ్ పంటలు అధ్వానంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారులు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. శని వారం సచివాలయంలో జిల్లా జేడీఏలు, ఇతర వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. జేడీఏలు జిల్లాల్లో పరిస్థితిని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

ముఖ్యంగా మొక్కజొన్న ఎండిపోతోందన్నారు. పోచారం మాట్లాడుతూ బోర్లల్లో తక్కువ నీరుండి పంటలకు సరిపోని పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు స్ప్రిం క్లర్లు ఇవ్వాలని, వాటిని ఎలా అందించాలో ఉద్యానశాఖ కసరత్తు చేయాలని సూచించినట్లు తెలిసింది. ఖరీఫ్ పంటలు నష్టపోతే ముందస్తు రబీకి సన్నాహాలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతోందని, వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. ఆ తర్వాత పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు  తెలిసింది.
మరిన్ని వార్తలు