ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు 2.30 లక్షల వేతనం

29 Mar, 2016 01:12 IST|Sakshi

♦ సీఎంకు నెలకు రూ.2.44 లక్షలు, మంత్రులకు రూ.2.42లక్షలు
♦ బిల్లు ప్రవేశ పెట్టిన హరీశ్‌రావు

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేతనాల పెంపునకు సంబంధించి అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు సోమవారం అసెంబ్లీలో బిల్లు (తెలంగాణ జీతాలు, పింఛన్ చెల్లింపులు డిస్‌క్వాలిఫికేషన్ తొలగింపు చట్టం- 1953 సవరణ)ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఉన్న రూ.83వేల వేతనం మూడు రెట్లు పెరిగి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రూ.2.30 లక్షల జీతభత్యాలు అందనున్నాయి. వేతనాల పెంపు అమల్లోకి వస్తే ప్రభుత్వంపై ఏటా రూ.42.67 కోట్ల అదనపు భారం పడనుంది. దీనిపై మంగళవారం అసెంబ్లీ, మండలిలో చర్చ జరగనుంది.

ఒకసారి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా పనిచేసిన వారికి నెలకు రూ.30 వేలు పెన్షన్‌గా అందుతుంది. రెండు కన్నా ఎక్కువసార్లు పనిచేసిన వారికి నెలకు రూ.వెయ్యి చొప్పు న పెన్షన్ పెరుగుతుంది. గరిష్టంగా రూ.50 వేలకు మించకుండా అందిస్తారు. ఆయా భత్యాలు కలిపి ముఖ్యమంత్రికి నెలకు రూ.2.44 లక్షలు, మంత్రులు, ఇతరులకు రూ.2.42 లక్షలు అందనుంది. మంత్రులు, ఇతరులకు వేతన ం పేర రూ.14 వేలు, ప్రత్యేక భత్యం రూ.8 వేలు, ఆతిథ్య భత్యం రూ.7 వేలు, క్యాంపు కార్యాలయ భత్యం రూ.10 వేలు, భద్రత కారుకు రూ. 25 వేలు, సొంత కారుకు రూ.30 వేలు, ఇంధనానికి రూ.15 వేలు, ఇంటి అద్దెకు రూ.50 వేలు, నియోజకవర్గ ఖర్చుల కోసం రూ.83 వేలు మొత్తం రూ.2.42 లక్షలు చెల్లిస్తారు. కాగా, సీఎం వేతనం రూ.16 వేలుగా, మిగిలిన అలవెన్సులు పై విధంగానే చెల్లిస్తారు.

మరిన్ని వార్తలు