ఫైబర్‌ గ్రిడ్‌పై నోకియా ఆసక్తి

25 May, 2017 02:36 IST|Sakshi
ఫైబర్‌ గ్రిడ్‌పై నోకియా ఆసక్తి

అమెరికాలో పలు కంపెనీలతో మంత్రి కేటీఆర్‌ విస్తృత చర్చలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికీ వేగవంతమైన ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందిస్తామని, దీంతో దేశంలోని టెలికమ్యూనికేషన్, ఇంటర్‌నెట్‌ రంగాల్లో విప్లవాత్మక మార్పులొస్తాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. అమెరికా పర్యట నలో భాగంగా బుధవారం శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో టెలికం దిగ్గజాలైన నోకియా, ఎరిక్‌సన్‌ కంపెనీలతో ఆయన సమావేశమై చర్చించారు. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో భాగస్వా ములు కావాలని ఆ కంపెనీలను ఆహ్వానించగా, నోకియా ఆసక్తి కనబరిచింది.

త్వరలో ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుపై ఆసక్తి వ్యక్తీకరణ (ఆర్‌ఎఫ్‌సీ) కోసం నిర్వహించే టెండర్లలో పాల్గొంటామని నోకియా ప్రతినిధి బృందం తెలిపింది. తెలంగాణలో నోకియా మొబైల్‌ ఫోన్‌ పరికరాల తయారీ ప్లాంటు లేదా పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయా లని కోరారు. అక్కడి ఎరిక్‌సన్‌ కంపెనీని సందర్శించి అక్కడి ఎక్స్‌పీరియన్స్‌ సెంట ర్‌ను పరిశీలించారు. యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో ముఖాముఖి అయ్యారు.

మ్యూల్‌సాఫ్ట్‌ కూడా ఆసక్తి..
రాష్ట్రంలో తమ కంపెనీ విస్తరణ అవకాశాల ను పరిశీలిస్తామని, హైదరాబాద్‌ను కూడా తమ భవిష్యత్తు విస్తరణ ప్రణాళికల్లో చేర్చు తామని మ్యూల్‌ సాఫ్ట్‌ కంపెనీ హామీ ఇచ్చింది. హైదరాబాద్‌లో మ్యూల్‌సాఫ్ట్‌ విస్త రణకు ఉన్న అవకాశాలను కేటీఆర్‌ కంపెనీ ప్రతినిధులకు వివరించారు. కాగా, అధిక సంఖ్యలో స్టార్టప్స్‌ ఉన్న టీ–హబ్‌తో కలసి పనిచేసేందుకు స్ట్రైప్‌ సంస్థ ముందుకొచ్చిం ది. సిలికాన్‌ వ్యాలీలో టీ–హబ్‌ ఏర్పాటు చేసిన టీ–బ్రిడ్జితో కలసి పనిచేస్తామని స్ట్రైప్‌ ప్రతినిధులు తెలిపారు. డిజిటల్‌ ఆర్థిక లావాదేవీల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంద ని, ఆర్థిక సేవలందించే స్ట్రైప్‌ సంస్థకు రాష్ట్రం అనుకూల ప్రాంతమని మంత్రి వివరించారు. అమెరికాలో కంపెనీలు ఏర్పాటు చేయాలను కునే వారికోసం అట్లాస్‌ ద్వారా సహకారమం దిస్తామని స్ట్రైప్‌ ప్రతినిధులు తెలిపారు. అంతకు ముందు శాన్‌ఫ్రాన్సిస్కోలోని సేల్స్‌ ఫోర్స్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్‌ ప్రసంగించారు.

మరిన్ని వార్తలు