పార్శీ ఫెస్ట్

10 Jul, 2014 23:51 IST|Sakshi
పార్శీ ఫెస్ట్

‘దక్షిణాదితో  పోలిస్తే పార్శీల  అభి‘రుచి’ డిఫరెంట్. వీరు స్పైసీగా ఉండే వంటకాలను ఇష్టపడతారు’ అని చెఫ్ మహేష్ చెప్పారు. ముంబై నుంచి ప్రత్యేకంగా నగరానికి వచ్చిన ఆయన ప్రస్తుతం తాజ్‌కృష్ణాలో నిర్వహిస్తున్న పార్శీ ఫుడ్ ఫెస్టివల్‌లో పార్శీ రుచులను అందిస్తున్నారు.

స్పైసీ వంటకాలను స్వీట్ కాంబినేషన్‌తో తినే పార్శీల వింత అభిరుచికి తగ్గట్టుగా చికెన్ ఫర్చా విత్ ఖట్టా మీఠా సాస్, లాసీ కట్లెట్ (మీట్), మటన్ దంశక్ వంటి వాటితో పాటు లగాన్ న్యూ కస్టర్‌‌డ, పార్శీ సేవ్, పార్శీ కుల్ఫీ... వంటి డిసర్‌‌ట్స కూడా అందించే ఈ ఫుడ్ ఫెస్ట్ ఈ నెల 20 దాకా కొనసాగుతుంది. నగరంలో నివసించే పార్శీలకు మాత్రమే కాదు వెరైటీ రుచులను కోరుకునేవారికీ ఇది ఒక కానుక అని చెప్పారు మహేష్.     
శిరీష చల్లపల్లి
 
ఆకృతి వస్త్ర
సరికొత్త చీరలు, డ్రెస్ మెటీరియుల్స్‌తో ఏర్పాటు చేసిన ‘ఆకృతి వస్త్ర’ వుగువల వునసు దోచుకుంటోంది. క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమీర్‌పేట్ కవ్ముసంఘం హాల్‌లో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. వూజీ వుంత్రి, ఎమ్మెల్యే గీతారెడ్డి... తన కువూర్తెతో కలిసి సందర్శించారు. శనివారం వరకు ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుంది.
ఫొటోలు: జి.రాజేష్

మరిన్ని వార్తలు