ప్రత్యూష పెదనాన్నను కోర్టులో హాజరుపరచండి

16 Jul, 2015 12:04 IST|Sakshi
ప్రత్యూష పెదనాన్నను కోర్టులో హాజరుపరచండి

హైదరాబాద్ : సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో తీవ్ర హింసకు గురైన ప్రత్యూష కేసుకు సంబంధించిన నివేదికను పోలీసులు గురువారం హైకోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం ప్రత్యూష కోలుకుంటుందని, ఆమె శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిందని, పరారైన తండ్రి రమేష్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు.  కాగా ఈ కేసులో సరైన సమయంలో స్పందించిన ఎల్బీనగర్ పోలీసులు, వైద్యం అందించిన గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యాన్ని హైకోర్టు  ఈ సందర్భంగా అభినందించింది.

అలాగే ప్రత్యూష ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎక్కడుంటుందో తెలుసుకోవాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల్లో ఉండేందుకు ప్రత్యూష అంగీకరిస్తే సదుపాయాలు కల్పిస్తామని హైకోర్టు తెలిపింది. ఆమెతో మాట్లాడి నివేదిక సమర్పించాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది. అలాగే ప్రత్యూష పెదనాన్నను శుక్రవారం కోర్టులో హాజరు పరచాలని కోర్టు సూచించింది. మరోవైపు ప్రత్యూష తండ్రి రమేష్ ను గతరాత్రి ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి ఇవాళ కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు