న్యాయవిచారణ జరపాలి

18 Oct, 2016 02:24 IST|Sakshi
న్యాయవిచారణ జరపాలి

టెండర్లు, చెల్లింపులపై పొంగులేటి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: దుమ్ముగూడెం టెయిల్‌పాండ్, రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్, శివన్న సాగర్ ప్రాజెక్టుల టెండర్లు, చెల్లింపులపై న్యాయవిచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ బిల్లుల విషయంలో అదనపు చెల్లింపులు జరిగాయని, వీటిపై విజిలెన్సుతో సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సోమవారం లేఖ రాశారు. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ సర్వే కోసం రూ.520 కోట్లు ఇచ్చారని, 10 ఏజెన్సీలకు రూ.395 కోట్లు అదనంగా ఇచ్చారని ఆరోపించారు.

చేయని పనులకు, రద్దయిన పనులకు భారీగా కేటాయింపులు చేశారని ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టు టెండర్లలోనూ అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. శివన్న సాగర్ అంచనాల్లో పెరుగుదలపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధిక వర్షాలకు నష్టపోయిన రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
 

మరిన్ని వార్తలు