సలాం కొట్టలేదని చెయ్యి నరికాడు

12 Sep, 2013 06:44 IST|Sakshi

గోల్కొండ, న్యూస్‌లైన్: సలాం చెప్పకపోవడమే ఆ పెయింటర్ చేసిన నేరం... దాన్నే తలవంపుగా భావించిన ఓ రియల్టర్ అతడి వెంటపడి మరీ చేయి నరికాడు. మంగళవారం గోల్కొండ ఠాణా పరిధిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఎస్సై గోపాల్‌రావు కథనం ప్రకారం... మహ్మదీ లైన్స్‌లోని శాతంనగర్ వాసి సయ్యద్ షకీల్ పెయింటర్. మంగళవారం రాత్రి ఇంటికి తిరిగి వెళ్తూ జీషాన్ హోటల్ పక్క సందులోకి చేరుకున్నాడు. అక్కడ షకీల్‌కు ఎండీలైన్స్‌కు చెందిన రియల్టర్ యహ్యాఖాన్ తారసపడ్డాడు.
 
 షకీలఠ్ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని భావించిన యహ్యా‘క్యాబే.. సలాం నైకర్తా’ (ఏం రా సలాం చెయ్యవా?) అంటూ హూంకరించాడు. దీన్ని పట్టించుకోని షకీల్ తన దారిన ముందుకు వెళ్లాడు. దీన్ని అవమానంగా భావించిన యాహ్యా ‘నీ పని పడతా’నంటూ పక్కనున్న మాసం దుకాణం నుంచి కత్తి తీసుకుని షకీల్ వెంటపడ్డాడు. అతనిని వెంటాడి మరీ పట్టుకుని కత్తితో దాడి చేశాడు. ఘటనలో షకీల్ ఎడమ చేయి మణికట్టు భాగం 70శాతం మేర తెగింది. పోలీసులు షకీల్‌ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న యహ్యా కోసం గాలిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా